గూగుల్ చేతికి బెంగుళూరు కంపెనీ ఇంపర్మియమ్

Posted By:

గూగుల్ చేతికి బెంగుళూరు కంపెనీ ఇంపర్మియమ్

బెంగుళూరు ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ స్టార్టప్ లిటల్ ఐ ల్యాబ్స్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ భారత్‌తో సంబధాలున్నమూడు సంవత్సరాల స్టార్టప్ ఇంపర్మియమ్ (Impermium)ను కొనుగోలు చేసింది. మూడు సంవత్సరాల వయసు కలిగి ఈ స్టార్టప్ కు భారతీయులైన విష్ రామారావు, నవీన్ జమాల్‌లు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇంపిర్మియమ్‌ కంపెనీ మూడవ వ్యవస్థాపకునిగా మార్క్ రైషర్ ఉన్నారు

ఈ స్టార్టప్‌కు బెంగుళూరు ఇంకా కాలీఫోర్నియాలో ఆఫీసులు ఉన్నాయి. జమాల్ బెంగుళూరు ఆఫీసు కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. రామారావు, రైషర్‌లు కాలీఫోర్నియాలోని ఆఫీసు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇంపర్మియమ్ కంపెనీ వెబ్‌సైట్‌ల కోసం సెక్యూరిటీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఆక్సెల్ పార్ట్నర్స్, AOL వెంచర్స్, చార్లెస్ రివర్ వెంచర్స్ ఇంకా హైల్యాండ్ కాపిటల్ పార్ట్నర్స్ వంటి వెంచర్ సంస్థల నుంచి ఇంపర్మియమ్ $ 9 మిలియన్‌ల నిధులను పొందంది. తమ కంపెనీని గూగుల్ కొనుగోలు చేసినట్లు ఇంపిర్మియమ్‌ కంపెనీ సీఈఓ మార్క్ రైషర్ ఒక ప్రకటనను వెలువరించారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను గూగుల్ వెలువరించాల్సి ఉంది.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot