గూగుల్ మరో కొత్త సర్వీస్ డీల్‌మ్యాప్ డీల్స్ సర్వీస్

Posted By: Staff

గూగుల్ మరో కొత్త సర్వీస్ డీల్‌మ్యాప్ డీల్స్ సర్వీస్

కాలిఫోర్నియా: సెర్చ్ ఇంజన్ గెయింటే గూగుల్ 2మిలియన్ యూజర్స్‌ను కలిగి ఉన్నటువంటి లోకేషన్ ఆధారిత సర్వీస్‌ని అందించే డీల్ మ్యాప్ అనే వెబ్‌ సైట్‌ని కొనుగోలు చేసిందని సమాచారం. డీల్ మ్యాప్ వెబ్ సైట్ మే 2010లో ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే లోకల్‌గా ఉన్న అన్ని డీల్స్‌‌ని ఒకే చోటుకి తీసుకొచ్చి లోకల్ డీల్స్‌ని షేర్ చేస్తుంది. గూగుల్ ఇటీవల ప్రారంభించిన డీల్స్ సర్వీస్‌కి తాను కొనుగోలు చేసిన డీల్ మ్యాప్ సర్వీస్‌ని యాడ్ చేయనుందని సమాచారం.

గూగుల్ కంపెనీ డీల్ మ్యాప్ సర్వీస్‌ని కొనుగోలు చేసిందన్న విషయాన్ని డీల్ మ్యాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఐతే గూగుల్ ఎంత డబ్బుకి తనని కొనుగోలు చేసిందనే విషయాలు మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. ఈ సందర్బంలో డీల్ మ్యాప్ ప్రతినిధి మాట్లాడుతూ గూగుల్‌తో మేము కలవడం వల్ల మా అభివృద్దికి, మా మిషన్‌‌కి తన సహాకారాన్ని అందిస్తుందనే ఇలా చేశాం అన్నారు. అంతేకాకుండా జనాభాకి లోకల్ డీల్స్ చేసి వారి ఖర్చుని కూడా తగ్గించడం మా ముఖ్యమైన పనని అన్నారు. మేము ఒక విజన్‌తో ముందుకు సాగుతుండడం చూసి గూగుల్ వారి తన యొక్క పాట్నర్‌‌గా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని బ్లాగ్‌లో వెల్లడించారు.

ప్రస్తుతం మేము అందిస్తున్న కోర్ ప్రోడక్ట్స్, పాట్నర్ సర్వీసెస్‌ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. గూగుల్‌కి విక్రయించినప్పటికీ డీల్ మ్యాప్ వెబ్ సైట్ ద్వారా యూజర్స్ వారియొక్క డైలీ డీల్స్‌ని యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. మా యొక్క డిస్ట్రిబ్యూషన్ పాట్నర్‌కి ఎపిఐ, ఫీడ్స్‌ని అందించడం జరుగుతుందని తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot