యూజర్లకు తెలియకుండానే ఫోన్ సెట్టింగ్స్‌ను మార్చేస్తోన్న గూగుల్!
గూగుల్ మనకు తెలియకుండా మన ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆపరేట్ చేస్తోందా? అంటే, అవుననే అంటున్నారు పలువురు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.
గూగుల్ మనకు తెలియకుండా మన ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆపరేట్ చేస్తోందా? అంటే, అవుననే అంటున్నారు పలువురు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రైవసీకి సంబంధించి ఇటీవల జరిగిన ఓ చర్చాగోష్టి కార్యక్రమంలో భాగంగా పలువురు యూజర్లు ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ఆండ్రాయిడ్ డివైసెస్‌లోని ''బ్యాటరీ సేవర్’’ (Battery Saver) మోడ్ తమ ప్రమేయం లేకుండానే ఆటోమెటిక్‌గా ఎనేబుల్ అయిపోతుందంటూ వీరు వాపోయారు.

పొరపాటున పబ్లిక్‌లోకి రావటం వల్లే..
ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గూగుల్ పిక్సల్ ఫోన్‌లను వినియోగించుకుంటోన్న చాలా మంది యూజర్లు తమ ఫోన్‌లలో తగినంత బ్యాటరీ పవర్ ఉన్నప్పటికి అవి బ్యాటరీ సేవర్ మోడ్‌లోకి వెల్లిపోవటాన్ని గుర్తించారు. Android Pie ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య ఎక్కువుగా కనిపిస్తోందని ఆండ్రాయిడ్ పోలీస్ పరిశీలనలో తేలింది. అనేక టిప్స్ అనే కామెంట్స్‌ను పరిశీలించిన తరువాత ఇది చాలా విస్తృతమైన సమస్య అని ఒక నిర్ణయానికి వచ్చామని ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపింది. దీని పై గూగుల్ స్పందిస్తూ అపరేటింగ్ సిస్టంలో తాము చేసిన అంతర్గత మార్పుల వల్ల ఈ విధంగా జరిగిందని, పొరపాటున ఈ అప్‌డేట్ పబ్లిక్‌లోకి రోల్ అవుట్ అవ్వటం వల్లే ఇలా జరిగిందని రెడ్డిట్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చుకుంది.

మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతోందా..?
మీరు లేటెస్ట్ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్నట్లయితే, మీ డివైస్ మీ ప్రతి కదలికను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది. ఈ విధంగా ట్రాక్ చేసిన సమాచారాన్ని యూజర్ పర్సనలైజెడ్ సర్వీసులకు మాత్రమే ఉపయోగిస్తామని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయబడిన డేటా మాత్రం నేరుగా గూగుల్‌కు చేరుతుంది. వాస్తవానికి లోకేషన్ ట్రాకింగ్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముంది. ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు తమ డివైస్‌లోని లోకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను భేషుగ్గా టర్నాఫ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ యూజర్లు ఏం చేయాలంటే..?
మందుగా తమ ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ప్రైవసీ సెక్షన్‌లోని Location Serviceను సెలక్ట్ చేసుకోవాలి. తదుపరి స్టెప్‌లో భాగంగా లోకేషన్ సర్వీసెస్‌లోని System Servicesను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత సిస్టం సర్వీసెస్‌లోని Frequent Locationను సెలక్ట్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్ లోకేషన్‌ను turn off టర్నాఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయాలంటే..?
ఆండ్రాయిడ్ యూజర్లు మందుగా తమ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోని Privacy ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రైవసీ మెనూలోకి వెళ్లిన తరువాత Google Location Historyని సెలక్ట్ చేసుకోవాలి. తదుపరి చర్యలో భాగంగా Location Historyని పూర్తిగా డిలీట్ చేయాలి. లొకేషన్ హిస్టరీ డిలీట్ అయిన తరువాత లోకేషన్ హిస్టరీని టర్నాఫ్ చేసినట్లయితే మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.


Click it and Unblock the Notifications