18వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్.. ఆసక్తికర విషయాలు

|

సెర్చ్ ఇంజన్ గూగుల్ తన 18వ పుట్టిన రోజును మంగళవారం ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన హోమ్ పేజీ పై ఆసక్తికర పుట్టినరోజు డూడుల్‌ను అప్‌లోడ్ చేసింది. 1998, సెప్టెంబర్ 27న అమెరికాకు చెందిన లారీ పేజ్, సెర్జి బ్రిన్‌లు గూగుల్‌ సంస్థను స్థాపించారు.

18వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్.. ఆసక్తికర విషయాలు

Read More : సగం ధరకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరపడండి

అయితే, 2004లో గూగుల్ పుట్టినరోజును సెప్టంబర్ 7న నిర్వహించారు. అంతకు ముందు సంవత్సరం సెప్టెంబర్ 8 గూగుల్ బర్త్‌డే డూడుల్ కనిపించింది. దీంతో గూగుల్ పుట్టిన రోజు తేదీ విషయంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకుంది. 2005లో సెప్టంబర్ 26న గూగుల్ పుట్టిన రోజును నిర్వహించారు. 2006 నుంచి సెప్టెంబర్ 27నే గూగుల్ తన పుట్టినరోజును నిర్వహిస్తూ వస్తున్నారు. గూగుల్ సంస్థ మొదటి డూడుల్‌ను 'బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్' పేరుతో 1998లో మొదలుపెట్టింది గూగుల్ 18వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని పలు ఆసక్తికర విషయాలు..

1997లో నుంచి గూగుల్ ప్రస్థానం ప్రారంభమైంది...

1997లో నుంచి గూగుల్ ప్రస్థానం ప్రారంభమైంది...

సెప్టెంబర్ 15,1997న గూగుల్.కామ్ పేరుతో డొమైన్ రిజిస్టర్ అయ్యింది.  

1998లో..

1998లో..

1998లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ గూగుల్‌ సంస్థను స్థాపించారు.

2000 సంవత్సరంలో...

2000 సంవత్సరంలో...

మే 9, 2000న 10 భాషసలతో కూడిన సెర్చ్ ఇంజిన్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దాదాపు 150  పై చిలుకు భాషల్లో గూగుల్ లభ్యమవుతోంది. జూన్ 2000 గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్‌గా అవతరించింది. డిసెంబర్ 2000 గూగుల్ టూల్ బార్ రిలీజ్ అయింది.

2001లో...
 

2001లో...

జూలై 2001 గూగుల్ ఇమేజెస్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాదాపు 250 మిలియన్ల ఇమేజెస్ గూగుల్‌లో ఉన్నాయి. ఇదే అతి పెద్ద ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ వెబ్ డిసెంబర్ 2001 గూగుల్ మొదటి వార్షికొత్సవం జరిగింది. సంవత్సరంలో లక్షల మంది ప్రజలు  గూగుల్ లో ఏమి వెతికారు అన్నదానిపై కూడా చర్చ జరిగింది.

2002లో...

2002లో...

సెప్టెంబర్ 2002 గూగుల్ 4000 వార్తా వనరులను లాంచ్ చేసింది. ఇప్పుడు అది 50,000కి చేరింది.

డిసెంబర్ 2003లో

డిసెంబర్ 2003లో

డిసెంబర్ 2003 గూగుల్ ప్రింట్‌ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.  అయితే అది ఇప్పుడు గూగుల్ బుక్‌గా మారింది. గూగుల్ ఇప్పటికే 20 లక్షల పుస్తకాలను స్కాన్ చేసింది.

జనవరి 2004లో..

జనవరి 2004లో..

జనవరి 2004 గూగుల్ ఆర్కుట్‌ని లాంచ్ చేసింది.  ఏప్రిల్ 1, 2004న గూగుల్ జీమెయిల్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 425 మిలియన్ల మంది జీమెయిల్ ని వాడుతున్నారు. అక్టోబర్ 2004 గూగుల్ తన ఆఫీసులను హైదరాబాద్, బెంగుళూరులో ప్రారంభించింది.

ఫిబ్రవరి 2005న....

ఫిబ్రవరి 2005న....

ఫిబ్రవరి 2005 గూగుల్ మ్యాప్‌లను లైవ్‌లోకి వచ్చింది. ఏప్రిల్ 2005 ఫస్ట్ వీడియో గూగుల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు ప్రతి గంటకు 100ల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ప్రతి నిమిషానికి ఓ వీడియో అఫ్ లోడ్ అవుతూ పీపుల్స్ నెలకు 6 మిలియన్ల గంటలు వీక్షిస్తున్నారు. జూన్ 2005 గూగుల్ తన మొబైల్ సెర్చ్ ని ప్రారంభించింది. అలాగే గూగుల్ ఎర్త్ ని లాంచ్ చేసింది. గూగుల్ ఎర్త్ ని ఇప్పటికే లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. నవంబర్ 2005 గూగుల్ తన ఎనాలటిక్స్‌ని లాంచ్ చేసింది.

2006లో గూగుల్ ట్రాన్స్‌లేటర్‌

2006లో గూగుల్ ట్రాన్స్‌లేటర్‌

ఏప్రిల్ 2006లో గూగుల్, ట్రాన్స్‌లేటర్‌ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు 80 భాషల్లో ఈ అనువాదం లభ్యం అవుతోంది. మే 2006 గూగుల్ ట్రెండ్స్ ఎక్కువమంది ఏమి చూసారు అన్నదానిని రిలీజ్ చేసింది.

ఫిబ్రవరి 2007లో

ఫిబ్రవరి 2007లో

యుఎస్ సిటీలోని 30 నగరాలకు సంబంధించిన ట్రాఫిక్ సమాచారాన్ని గూగుల్ యాడ్ చేసింది. ఇప్పుడు అది 50 సిటీలకు పైగానే సమాచారం లభ్యమవుతోంది. నవంబర్ 2007 ఆండ్రాయిడ్ అనౌన్స్ చేసింది.

సెప్టెంబర్ 2008లో

సెప్టెంబర్ 2008లో

సెప్టెంబర్ 2008 జీ1 ఫస్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇదే నెలలోనే గూగుల్ క్రోమ్‌ని కూడా రిలీజ్ చేసింది.

ఫిబ్రవరి 2009లో

ఫిబ్రవరి 2009లో

ఫిబ్రవరి 2009 ఆండ్రాయిడ్‌లో వాయిస్ సెర్చ్ వెబ్‌ని రిలీజ్ చేసింది. అక్టోబర్ 2009 గూగుల్ మ్యాప్ నేవిగేషన్ ఇంట్రడ్యూస్ చేసింది.

2010లో...

2010లో...

జనవరి 2010లో గూగుల్ నెక్సుస్‌ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2010 గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టైపింగ్‌ని లాంచ్ చేసింది.

ఫిబ్రవరి 2012లో

ఫిబ్రవరి 2012లో

ఫిబ్రవరి 2012 ఆండ్రాయిడ్ క్రోమ్ లాంచ్ అయింది ఏప్రిల్ 2012 గూగుల్ డ్రైవ్ రిలీజ్ అయింది.

2013లో...

2013లో...

జూన్ 2013 లూన్ ప్రాజెక్ట్‌ని గూగుల్ చేపట్టింది. అలాగే జూలై 2013న మొబైల్ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్‌ని రిలీజ్ చేసింది.

జూలై 2014..

జూలై 2014..

జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను హిందీలో లాంచ్ చేసారు.సెప్టెంబర్ 2014న ఆండ్రాయిడ్ వన్ ఇండియాలో ఆపరేటింగ్ సిస్టం ఇండియాలో లాంచ్ అయ్యింది. అక్టోబర్ 14న గూగుల్ వాయిస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది.

2016లో..

2016లో..

జూన్ 2015 గూగుల్ ఫోటోస్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్టు 10 సిలికాన్ వ్యాలీలో ఆల్ఫాబెట్‌ను అనౌన్స్ చేసింది. 2016లో Google Allo, Google Duo పేరుతో విప్లవాత్మక యాప్ లను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్..

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్..

ప్రస్తుతం గూగుల్ సంస్థకు భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నారు.

Best Mobiles in India

English summary
Google celebrates 18th birthday with a Doodle. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X