గూగుల్ మహిళా దినోత్సవ స్పెషల్

Posted By:

మహిళలకు ప్రత్యేకమైన హోదాను కల్పిస్తూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నమైన ఇంటరాక్టివ్ డూడుల్‌ను హోమ్ పేజీ పై పోస్ట్ చేసింది.

గూగుల్ మహిళా దినోత్సవ స్పెషల్

ఈ డూడుల్‌ను క్లిక్ చేసిన వెంటనే ఓ వీడియో ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియోలో వివిధ దేశాలకు చెందిన మహిళలు తమ తమ మాతృ భాషల్లో మహిళా దినోత్సవ శుభకాంక్షలు తెలుపుతూ కనిపిస్తారు. మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న సాహస బాలిక మలాలా, ప్రముఖ గాయనీ ఆషా భోంస్లే వంటి ప్రముఖ మహిళలు ఈ వీడియోలో కనిపిస్తారు. చివరిగా ఈ డూడుల్ ‘హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే' టైటిల్‌తో ముగుస్తుంది.

గూగుల్ డూడుల్ పేరుతో ప్రత్యేకమైన సంస్కృతికి గూగుల్ తెర లేపింది. సెర్జ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రముఖులకు సంబంధించి ప్రత్యేక దినాలను పురస్కరించుకుని వారి విశిష్టతను గుర్తుచేస్తూ హోమ్‌పేజీ పైప్రత్యేక డూడుల్స్‌ను ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot