15వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగల్!!

Posted By:

ఇంటర్నెట్ అంటే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్. ఇంటర్నెట్‌కు పర్యాయపదంగా నిలిచిన గూగుల్ ఈ రోజు తన 15వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన హోమ్‌పేజీ పై ఆసక్తికర ఇంటరాక్టివ్ పినాటా డూడుల్‌ను పోస్ట్ చేసింది. ఈ వినోదాత్మక ఇంటరాక్టివ్ డూగుల్ నెటిజనులకు మంచి టైంపాస్. వాస్తవానికి గూగుల్‌ను సెప్టంబర్ 4, 1998న స్థాపించటం జరిగింది. 2005 వరకు గూగుల్ తన పుట్టినరోజును సెప్టంబర్ 4న జరుపుకునేది. న్యాయపరమైన కారణావల్ల ఆ తేదీని సెప్టంబర్ 27కు మార్చారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

15వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగల్!!

తమ కంపెనీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గూగుల్ తమ సెర్చ్ ఇంజన్ కోసం హమ్మింగ్‌బర్డ్ అనే కొత్త అల్గారిదమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఆవిష్కరణ గూగుల్ సెర్చ్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. మనం టైప్ చేసేకీవర్డ్స్ ఆధారంగా మరింత సమర్థంగా మనకు కావల్సిన వెబ్‌సైట్‌ల సమాచారం ఇంకా డాక్యుమెంట్ల సమాచారాన్ని అందించటంలో హమ్మింగ్ బర్డ్ అల్గారిదమ్ క్రీయాశీలకంగా వ్యవహరించనుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/rogR-aLlEXA?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

గూగుల్ ఓ రిసెర్జ్ ప్రాజెక్టుగా జనవరి 1996లో ప్రారంభమైంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులు లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌లు ఈ ప్రాజెక్టుకు ముఖ్య కారకులు. తరువాతి క్రమంలో ఈ ప్రాజెక్టు కాస్తా సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌గా రూపాంతరం చెందింది.

1998 సెప్టంబర్4న ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot