గూగుల్ డూడుల్ ప్రత్యేకం యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్‌టన్‌‌‌ల వెడ్డింగ్

Posted By: Staff

గూగుల్ డూడుల్ ప్రత్యేకం యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్‌టన్‌‌‌ల వెడ్డింగ్

ఏప్రిల్ 29 ప్రపంచం మొత్తం చూపు లండన్ పైనే ఉంది. దానికి గల కారణం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు విలియమ్స్ తన స్నేహితురాలు కేట్ మిడిల్‌టన్‌‌ని ఈరోజు వివహాం చేసుకోనున్నారు. దీనికోసం సెర్చ్ ఇంజన్ గెయింట్ అయిన గూగులు కూడా యువరాజు మీద ఉన్నటువంటి అభిమానాన్ని గూగుల్ హోం పేజి మీద వారియొక్క పేరు మీద గూగుల్ డూడుల్‌ని ఉంచడం జరిగింది.

ఈరోజు ఉంచినటువంటి గూగుల్ డూడుల్‌లో రాయల్ వెడ్డింగ్‌కి చిహ్నాంగా ఉంచడం జరిగింది. రాయల్ వెడ్డింగ్ జరిగే లండన్ వీధులని లైటింగ్ కాంతులతో పెయింటింగ్ వేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ బిల్డింగ్స్‌ని మనం గనుక క్షణ్ణంగా పరిశీలించినట్లైతే అందులో గూగుల్ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా డూడుల్‌లో పెళ్శి జరిగేటటువంటి వెస్ట్ మనిస్టర్ అబ్బీ చర్చి, డిస్నీ ఆకారంలో రాణి ధరించే గౌను, ఇక బ్యాక్ గ్రౌండ్‌లో లండన్ మొత్తం ప్రిన్స్ మ్యారేజిని చూస్తున్నట్లుగా పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ డూడుల్‌ని గనుక మనం చూసినట్లైతే అందంగా ముద్దుగా ఉంది.

ఈ గూగుల్ డూడుల్ స్పెషల్ ఏమిటంటే రాయల్ వెడ్డింగ్ దృష్టిలో పెట్టుకోని లండన్ లోకల్ ఆధారంగా ప్రపంచం మొత్తం మారుతూ ఉంటుంది. కానీ గతంలో గూగుల్ డూడుల్ ఆయా దేశాలను బట్టి 12:00 గంటలకు మారుతూ ఉంటుంది. గతంలో గూగుల్ డూడుల్‌లో మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ వంటి అనేక ఉపకరణాలను ప్రాణం పోసిన గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ 164వ జన్మదినాన్ని, ఫ్రెంచ్‌కు చెందిన సైన్స్ ఫిక్షన్ నవలల రచయిత "జూల్స్ వెర్న్" 183వ జన్మదినాన్ని కూడా గుర్తు చేసిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot