Home
News

గూగుల్ ఉద్యోగులకు Free Food పై షాకింగ్‌ నిజాలు చెప్పిన CEO సుందర్‌ పిచాయ్‌..!

గూగుల్‌.. టెక్‌ దిగ్గజాల్లో అగ్రశ్రేణి సంస్థ. గూగుల్ ఉత్పత్తులు ఎంత ప్రత్యేకమైనవో.. అందులో ఉద్యోగానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. సరైన గుర్తింపు, భారీ వేతనాలు సహా ఉద్యోగులకు గూగుల్‌ అందించే వివిధ రకాల ప్రయోజనాలు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Google CEO Sundar Pichai) ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉద్యోగులకు ఉచిత భోజనం అందించడంలో మీరు ఏం ఆశిస్తున్నారనే ప్రశ్నకు సుందర్ పిచాయ్‌ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. దీంతోపాటు గూగుల్‌లో ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు సహా వ్యక్తిగత అంశాలను కూడా పంచుకున్నారు.

ఉద్యోగుల భోజనాలకు ఎందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.. ?
బ్లూమ్‌బెర్గ్‌ కు చెందిన ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్‌ షోలో పాల్గొన్న సుందర్‌ పిచాయ్ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉచిత భోజనాల కోసం అధికంగా ఖర్చు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను వెల్లడించారు. ఉద్యోగులకు అందించే భోజనాలు కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదని, దాని వల్ల సంస్థకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయన్నారు.

Google CEO sundar pichai

ఉద్యోగుల భోజన సమయంలో ఏం జరుగుతుంది ?
2004 లో గూగుల్‌ సంస్థలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ గా ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి భోజనం చేసిన సమయంలో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు వచ్చేవని చెప్పారు. ఉచిత భోజన సమయంలో ఒకరితో మరొకరికి మంచి సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో ఉద్యోగుల్లో సృజనాత్మకతను పెరగడం సహా సహా సరికొత్త ఆలోచనలు వస్తాయని, వాటితో సంస్థకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.

ఉద్యోగులకు ఉచితంగా భోజనాలు అందించేందుకు పెట్టే ఖర్చుతో పోలిస్తే.. భోజన వేలల్లో వచ్చే సరికొత్త ఆలోచనలతో సంస్థకు అధిక ప్రయోజనాలు ఉంటాయని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఇలాంటి ప్రయోజనాలు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపుతాయన్నారు. గూగుల్ ఆఫర్‌లను సుమారుగా 90 శాతం మంది అభ్యర్థులు అంగీకరిస్తారని చెప్పారు.

Google CEO sundar pichai

గూగుల్‌లో ఉద్యోగాల నియామకం సమయంలో.. ఎలాంటి నైపుణ్యాలను ఆశిస్తారన్న మరో ప్రశ్నకు సుందర్‌ పిచాయ్‌ సమాధానమిచ్చారు. ఉద్యోగాన్ని బట్టి ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయని, అయితే ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన ఉద్యోగ ప్రకటనల్లో కొత్త సవాళ్లకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వారికి అవకాశమిస్తామన్నారు.

ఇంకా ఎన్నో ప్రయోజనాలు :
గూగుల్‌ తన ఉద్యోగులకు ఉచిత భోజనం సహా హెల్త్ ఇన్స్యూరెన్స్‌, సౌకర్యవంతమైన పని వాతావరణం సహా వెల్‌నెస్‌ ప్రోగ్రాంలు, సెలవులు, చెల్లింపులు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఈ ఇంటర్య్వూలో సుందర్‌ పిచాయ్‌ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులు సహా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google CEO sundar pichai reveals facts behind offering free meal policy to employees
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X