గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏ ఫోన్ వినియోగిస్తారో తెలుసా..?
మనం సాధారణంగా సెలబ్రిటీలు వినియోగిస్తున్న వస్తువుల గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తాం. వారు వినియోగిస్తున్న కార్లు, ఫోన్ల వివరాలు ఆరా తీస్తాం. అయితే గూగుల్ సీఈవో అయిన సుందర్ పిచాయ్ ఏ ఫోన్‌ను వినియోగిస్తారు.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. అలాంటి వారికోసం ఈ స్టోరీ..
గూగుల్ కొన్నిరోజుల క్రితం తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వార్షిక డెవలపర్ల సదస్సులో Pixel Foldను విడుదల చేసింది. గూగుల్ పిక్సల్ ఫోన్లు ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే గూగుల్ సీఈవో అయిన సుందర్ పిచాయ్ ఏ ఫోన్‌ను వినియోగిస్తారు. తన సంస్థ రూపొందించిన పిక్సల్ సహా ఇతర ఫోన్లను వినియోగిస్తారా లేదా ఇతర బ్రాండ్లకు చెందిన ఫోన్లను వినియోగిస్తారా..? అనేది తెలుసుకుందాం.

ఈ ప్రశ్నకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గూగుల్ నుంచి ఏ ఉత్పత్తులు వచ్చినా తొలి వినియోగదారుల్లో తాను ఒకడినని వెల్లడించారు. తమ సంస్థ నుంచి ఇటీవల విడుదల అయిన పిక్సల్ ఫోల్డ్ మరియు పిక్సల్ 7a ఫోన్లను తాను పరీక్షించినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యులో మాట్లాడిన పిచాయ్.. గత కొంత కాలంగా గూగుల్ పిక్సల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరీక్షించినట్లు తెలిపారు.
ఈ ఫోన్లు మాత్రమే కాకుండా గూగుల్ పిక్సల్ 7 ప్రోను తన ప్రైమరీ ఫోన్‌గా వినియోగిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. మరియు శాంసంగ్ గెలాక్సీ మరియు ఐఫోన్‌ను పరీక్షల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌గా దేనిని ఉపయోగిస్తారన్న ప్రశ్నకు... ప్రస్తుతం గూగుల్ పిక్సల్ 7 ప్రోను వినియోగిస్తున్నా (టెస్టింగ్) అని చెప్పారు. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ, పిక్సల్ ఫోల్డ్, ఐఫోన్ సహా అన్నింటిని వినియోగిస్తానని వెల్లడించారు. టెస్టింగ్ చేయడానికి మరియు తన అనేక పనుల కోసం గూగుల్ ఫోల్డ్ ఫోన్ వినియోగించేందుకు పిచాయ్ ఇష్టపడతారని సమాచారం. మరియు సుందర్ పిచాయ్ మరో ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. తనకున్న వేర్వేరు సిమ్ కార్డులకు వేర్వేరు ఫోన్లను వినియోగిస్తానని తెలిపారు.
అయితే మీరు ఫోల్డబుల్ ఫోన్‌ను వినియోగిస్తున్నారా అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతం చాలా కాలం నుంచి టెస్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ తన సాధారణ పనుల కోసం ప్రైమరీ ఫోన్‌నే వినియోగిస్తానని చెప్పారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరియు బిజీగా ఉన్న సమయాల్లో తన ఫోన్‌లో మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటానని తెలిపారు. తాను తేలికైన ఫోన్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు పిచాయ్ తెలిపారు.
అయితే స్మార్ట్‌ఫోన్ల భవిష్యత్‌పై మాట్లాడిన సుందర్ పిచాయ్.. ప్రజలకు అవసరమయ్యే పరికరాలను తయారుచేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








