Home
News

గూగుల్‌ జెమినిపై సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు.. ఈ AI మోడల్‌ చాలా భిన్నమని వెల్లడి!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇటీవల తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బాట్‌ Bard ను Gemini గా మార్చింది. దాంతోపాటు AI చాట్‌బాట్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను.. జెమిని అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను (Google Gemini) లాంచ్‌ చేసింది. అయితే ఈ ప్రో వెర్షన్‌ ఇంకా గూగుల్ సంస్థ బార్డ్‌ అడ్వాన్స్‌డ్ (Bard Advanced) గానే పిలుస్తోంది. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తాజాగా కీలక వివరాలను వెల్లడించారు.

జెమిని అనేది అత్యంత సమర్థవంతమైన మరియు సురక్షితమైన AI మోడల్‌ను రూపొందిస్తున్నామన్నారు. మరియు బార్డ్‌ అనేది ప్రజలు నేరుగా వినియోగదారులతో పరస్పరంగా చర్చించే ప్రత్యక్ష మార్గంగా ఉందన్నారు. కాబట్టి జెమినిగా మార్చినట్లు చెప్పారు. ప్రస్తుతం మేం మోడల్‌ను అభివృద్ధి చేసే మార్గంగా కూడా ఉంటుందని తాము భావిస్తున్నాం. మరియు వినియోగదారుల నేరుగా పరస్పరం చర్య జరపవచ్చు.. కాబట్టి పేరు మార్పు అర్ధవంతంగా ఉందని మేం భావిస్తున్నామన్నారు.

google-ceo-sundar-pichai

గూగుల్‌ కొత్త జెమిని లార్జ్ లాంగ్వేజ్‌ మోడల్‌ జెమిని చాట్‌బాట్‌ మూడు వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది.

జెమిని నానో : ఇది జెమిని చిన్న లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. దీని స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించుకోవచ్చు.

జెమినీ ప్రో : ఇది జెమిని AI చాట్‌బాట్‌ ఉచిత వెర్షన్‌గా ఉంది. మరియు లార్జ్‌, అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది.

జెమిని అల్ట్రా : ఇది గూగుల్‌ బార్డ్‌ అధిక శక్తివంతమైన లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. ఇది జెమిని అడ్వాన్స్‌డ్‌ AI చాట్‌బాట్‌గా ఉంది. ప్రస్తుతానికి గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ మోడల్‌కు అల్ట్రా 1.0 యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు గూగుల్‌ అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది.

google-ceo-sundar-pichai

గూగుల్‌ జెమిని త్వరలో ఆండ్రాయిడ్‌, iOS ఫోన్లలో యాప్‌ల రూపంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇతర సంస్థల ఏఐ బాట్‌లతో పోలిస్తే గూగుల్‌ జెమిని భిన్నమైనదని సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. కేవలం టెక్స్ట్‌ మాత్రమే కాకుండా ఫోటోలు, ఆడియో, వీడియో, కోడ్‌ అన్ని విధాల ఫార్మాట్‌లలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గూగుల్‌ జెమినికి వాయిస్‌, ఫోటో, టెస్ట్స్‌ రూపంలో ఇన్‌పుట్‌ ఇచ్చినా వెంటనే స్పందిస్తుందన్నారు.

*అయితే తాజాగా సుందర్‌ పిచాయ్‌ ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారనే ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఉదయం లేవగానే టెక్‌మీమ్ అనే వెబ్‌సైట్‌లో అప్‌డేట్లు చూస్తానని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమలో జరుగుతున్న తాజా అప్‌డేట్లను హెడ్‌లైన్ల రూపంలో అందిస్తుందని తెలిపారు.

ఈ టెక్‌మీమ్‌ వెబ్‌సైట్‌ను 2005 సంవత్సరంలో గేబ్‌ రివేరా ప్రారంభించారు. టెక్‌ ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాల్లో ముఖ్యమైన వాటిని హెడ్‌లైన్ల రూపంలో అందుబాటులో ఉంచుతుంది. ఇదే వెబ్‌సైట్‌ను మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల, మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్క్‌, ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్‌ మోస్సేరి కూడా చదువుతామని గతంలోనే వెల్లడించారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Google CEO sundar pichai speaks on google gemini and how different from other models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X