Google Chrome బ్రౌజర్‌లో సరికొత్త స్మార్ట్ అప్‌డేట్లను గమనించారా!!!

|

ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది వినియోగదారులు ఇంటర్నెట్ కోసం ఉపయోగించే బ్రౌజర్‌లలో మొదటి స్థానంలో గూగుల్ క్రోమ్ ఉంటుంది. ఇది ఇప్పుడు క్రొత్తగా అప్ డేట్ ను పొందింది. క్రోమ్ యాప్ లో గూగుల్ చేసిన అనేక అండర్-ది-హుడ్ మెరుగుదలల కారణంగా ఇన్ని సంవత్సరాలలో ఇప్పటివరకు లభించిన పనితీరులో బ్రౌజర్‌కు అత్యధిక లాభాలు వచ్చాయని క్రోమ్ ప్రొడక్ట్ డైరెక్టర్ మాట్ వాడ్డెల్ తన బ్లాగులో తెలిపారు. వినియోగదారులు ఇప్పుడు నేరుగా అడ్రస్ బాక్స్ నుండి యాక్షన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా వేగవంతమైన నావిగేషన్ కోసం ఇటీవల ఓపెన్ చేసిన వెబ్‌సైట్‌లను మరియు క్రొత్త ట్యాబ్‌లలోని పేజీలను కనుగొనవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ సరికొత్త అప్ డేట్ ఫీచర్స్
 

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ సరికొత్త అప్ డేట్ ఫీచర్స్

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఇప్పుడు ఓపెన్ చేసిన ప్రతి ట్యాబ్ ముందు ఓపెన్ చేసిన క్రియాశీల ట్యాబ్‌ల కంటే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది CPU వినియోగాన్ని 5 రెట్లు తగ్గిస్తుంది మరియు బ్యాటరీ యొక్క లైఫ్ ను 1.25 గంటల వరకు పెంచుతుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఇప్పుడు మునుపటి కంటే 25% వేగంగా పనిచేస్తుంది. అలాగే పేజీ లోడింగ్ లో కూడా దీని స్పీడ్ 7% మెరుగుపడింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ వేగవంతమైన పనితీరుకు మీ డివైస్ కు గతంలో కంటే తక్కువ శక్తి మరియు ర్యామ్ అవసరం అవుతుంది.

Also Read: వోడాఫోన్ ఐడియా(Vi) సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్‌ల పూర్తి వివరాలు...

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ స్పీడ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ స్పీడ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను గతంలో కంటే వేగంగా ఇప్పుడు పేజీలను వెనుకకు మరియు ముందుకు లోడ్ చేస్తుంది. గూగుల్ క్రోమ్‌తో చాలా మంది వినియోగదారులకు అవసరమయ్యే ఒక విషయం ట్యాబ్‌ల సౌలభ్యం. ఈ ట్యాబ్‌లు వారి అంశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అనుమతిస్తాయి. చదవవలసిన వ్యాసాల నుండి, చేయవలసిన పనుల జాబితాలు వంటివి వేర్వేరు ట్యాబ్‌లలో స్టోర్ చేయబడతాయి. అలాగే మీరు ఇతర డివైస్లకు ట్యాబ్‌లను పంపడానికి కూడా వీలును కల్పిస్తుంది.

గూగుల్ క్రోమ్ టూల్ బాక్స్ ఫీచర్స్

గూగుల్ క్రోమ్ టూల్ బాక్స్ ఫీచర్స్

గూగుల్ క్రోమ్ ట్యాబ్‌లను ఏదైనా విషయాలను శోధించడంలో మీకు సహాయపడే ఫంక్షన్‌తో వస్తుంది. టూల్‌బాక్స్‌కు ‘టాబ్ సెర్చ్' ఎంపిక జోడించబడి వస్తుంది. ఇది క్షణంలో ట్యాబ్‌లను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. అయితే ఇది మొదట Chromebook లలో మరియు తరువాత ఇతర డెస్క్‌టాప్‌లలో అందుబాటులోకి రానున్నది.

గూగుల్ క్రోమ్ పాస్‌వర్డ్ ఫీచర్స్ ‌
 

గూగుల్ క్రోమ్ పాస్‌వర్డ్ ఫీచర్స్ ‌

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో వినియోగదారులు ఇప్పుడు నేరుగా అడ్రస్ బాక్స్ నుండి యాక్షన్స్ తీసుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు ‘హిస్టరీను తొలగించు' లేదా ‘పాస్‌వర్డ్‌లను సవరించు' అని టైప్ చేస్తే కనుక వారు నేరుగా అడ్రస్ బాక్స్ నుండి యాక్షన్స్ తీసుకోవడానికి అనుమతించబడతారు. యాప్ యొక్క వివిధ మెనూల ద్వారా సెర్చ్ చేయడానికి బదులుగా అడ్రస్ బాక్స్ నుండి నేరుగా ఈ ఎంపికలను కనుగొనడం ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Chrome Brings Latest 2020 Smarter Updates

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X