మైక్రో‌సాప్ట్ ఐఈ9 కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించిన గూగుల్ క్రోమ్11

By Super
|
Google Chrome-Microsoft IE
మార్కర్ రీసెర్చ్ కొత్త సర్వే ప్రకారం గూగుల్ ఇంటర్నెట్ బ్రౌజర్ అయినటువంటి క్రోమ్ మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కంటే కూడా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుందని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేని ఏప్రిల్ 2011లో కండక్ట్ చేయడం జరిగింది. మార్చిలో గూగుల్ బ్రౌజర్ అయినటువంటి క్రోమ్ 0.4శాతం పాపులారిటీని సంపాదించుకోగా, మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మాత్రం మార్చిలో 55.9 శాతం నుండి 55.1 శాతానికి పడిపోయింది.

వెబ్ బ్రౌజర్స్ మార్కెట్‌లో కొత్త సర్వేని కండక్ట్ చేసినటువంటి నెట్ అప్లికేషన్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కంటిన్యూగా మార్కెట్‌లో 55.1శాతం షేర్‌ని డామినేట్ చేయడం జరుగుతుంది. ఐతే ఎప్పుడైతే మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9ని విడుదల చేసిందో అప్పటి నుండి మార్కెట్‌లో తన పాపులారిటీ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో గూగుల్ వెబ్ బ్రౌజర్ అయినటువంటి క్రోమ్ తన షేర్‌ని పెంచుకుంది. మార్చి 2011లో క్రోమ్ షేర్ శాతం 11.5శాతం ఉండగా, అది ఏప్రిల్ నాటికి 11.9 శాతానికి పెరిగింది.

 

ఇక ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఉపయోగించేటటువంటి వెబ్ బ్రౌజర్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ రెండవ స్దానంలోకి వెళ్శిపోయింది. మార్చిలో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 21.8గా ఉన్నటువంటి షేర్ శాతం 21.6 శాతానికి పడిపోయింది. అంటే దాదాపుగా 0.2 షేర్ శాతం తగ్గిందన్నమాట. ఇలా జరగడానికి కారణం ఇటీవల మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4, మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9ని ఆయా బ్రౌజర్స్ విడుదల చేయడం జరిగింది. వీటికి పోటీగా గూగుల్ కూడా తన కొత్త బ్రౌజర్ క్రోమ్ 11ని విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి రెండు బ్రౌజర్లతో పోల్చుకుంటే క్రోమ్‌ బ్రౌజర్‌లో హెట్‌టియమల్ వాయిస్ ఇన్‌పుట్, వాయిస్ టెక్ట్స్ కన్వర్జేషన్స్ విత్ గూగుల్ ట్రాన్సిలేటర్ లాంటివి ఉండడంతో ఎక్కువ మంది దీనిని వాడుతున్నట్లు సమాచారం.

 

ఇక ఆపిల్ కంపెనీకి చెందినటువంటి వెబ్ బ్రౌజర్ సఫారీ మార్చి నెలలో తన మార్కెట్ షేర్‌ని 6.6 శాతం నుండి 7.1 శాతానికి పెంచుకోవడం జరిగింది. ఈ కొత్త సర్వేల వల్ల వెబ్ బ్రౌజర్స్ అన్నింటికి ఓ చక్కని గుణపాఠం తెలిసిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా యూజర్స్ ఎప్పుడూ అప్‌డేటెడ్, ఎక్కువ ఫీచర్స్ ఉన్నవాటిని మాత్రమే ఆదరిస్తారని తెలిసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X