Home
News

గూగుల్‌ క్రోమ్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లు.. ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు ఎలా ఉపయోగపడతాయి..?

గూగుల్‌ తన క్రోమ్ బ్రౌజర్‌ సెర్చ్‌ ఆప్షన్‌ లను మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్‌లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ మరియు iOS యూజర్ల కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో సెర్చ్‌ బార్‌, కొన్ని షార్ట్‌ కట్‌ లు సహా మరిన్ని ఫీచర్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఫీచర్‌ ల ద్వారా గూగుల్‌ క్రోమ్‌ లో సెర్చ్‌ ( Google Chrome ) మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తోంది.

నావిగేషన్‌ కోసం రీ డిజైన్‌ చేసిన అడ్రస్‌ బార్‌లు మరియు లోకల్‌ సెర్చ్‌ కోసం కొత్త షార్ట్‌ కట్‌లు వంటి ఉన్నాయి. దీంతోపాటు క్రోమ్‌ యాక్షన్‌ ఫీచర్‌ భాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రాంతంలో రెస్టారెంట్‌ కోసం వెతుకున్నప్పుడు.. వినియోగదారులకు మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. కాల్‌, డైరెక్షన్‌, రివ్యూ వంటి ఆప్షన్‌లు కనిపిస్తాయి.

Google chrome introduces top features

ఇప్పటికే ఆప్షన్ ఆండ్రాయిడ్‌కు అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి iOS యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది. ట్యాబ్లెట్‌లోను అడ్రస్‌ బార్‌ రీడిజైన్‌తో వచ్చింది. దీంతోపాటు వెబ్‌సైట్‌ ఇప్పటికే డ్రాప్‌ డౌన్ మెనులో వినియోగదారుడికి కనిపిస్తుంది. దీంతోపాటు యూజర్‌ టైపింగ్ అలవాట్లను ఆధారంగా షార్ట్‌కట్‌లను సూచనలు కూడా మెరుగుపర్చినట్లు తెలుస్తోంది.

దీంతోపాటు మరో గూగుల్‌ iOS యూజర్ల కోసం ట్రెండింగ్‌ సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ 2023 నుంచి ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. ఖాళీగా ఉన్న అడ్రస్ బార్‌ మీద క్లిక్‌ చేయగానే.. అప్పటి వరకు ఉన్న ట్రెండింగ్‌ సె‌ర్చ్‌ లిస్ట్‌ మీకు కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు.

దీంతోపాటు డిస్కవరీ ఫీడ్‌లో లైవ్‌ స్పోర్ట్స్‌ కార్డ్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ ఫీచర్‌తో ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌లు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గతంలో సెర్చ్‌ చేసిన వాటి గురించి అప్‌డేట్‌లు పొందనున్నారు. ఈ ఫీచర్‌ను కస్టమైజ్‌ చేసుకొనే అవకాశం ఉందని గూగుల్‌ తెలిపింది.

* గూగుల్ తాజాగా మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ 2024 తేదీలను ప్రకటించింది. ఆగస్టు 13న ప్రారంభం కానుందని తెలిపింది. భారత్‌ కాలమానం ప్రకారం ఆగస్టు 13వ తేదీ 10:30 PM కు ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని గూగుల్‌ నిర్వహించేది. ఈ సంవత్సరం మాత్రం రెండు నెలల ముందుగానే నిర్వహిస్తోంది.

ఈ ఈవెంట్‌లో ఏయే గ్యాడ్జెట్‌లను లాంచ్‌ చేయనున్నారో గూగుల్‌ అధికారికంగా వెల్లడించకపోయినా.. గూగుల్‌ AI తో కూడిన గూగుల్ పిక్సల్‌ 9 సిరీస్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో గూగుల్‌ పిక్సల్‌ 9, పిక్సల్‌ 9 ప్రో మరియు పిక్సల్‌ 9 ప్రో XL ఉన్నాయి. దీంతోపాటు పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సల్‌ వాచ్‌ 3 ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఈ మేడ్‌ బై గూగుల్ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పైన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ను అనుభవాన్ని మెరుగుపరిచే ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఫీచర్‌లు, పనితీరు మెరుగుపరిచేందుకు కావాల్సిన అప్‌గ్రేడ్‌లు ఆవిష్కరించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Google chrome launchs 5 features for better search experience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X