ఇక 2జీ స్పీడులోనూ వెబ్‌సైట్స్ వేగంగా లోడ్ అవుతాయి..
క్రోమ్ ఆండ్రాయిడ్ బ్రౌజర్‌కు 2జీ స్పీడ్ డిటెక్ట్ అయిన ప్రతిసారి జావాస్ర్కిప్ట్ ఆటోమెటిక్‌గా డిసేబుల్ అయ్యే విధంగా బ్రౌజర్ సెట్టింగ్స్‌ను గూగుల్ అప్‌డేట్ చేయబోతోంది.
క్రోమ్ ఆండ్రాయిడ్ బ్రౌజర్‌కు 2జీ స్పీడ్ డిటెక్ట్ అయిన ప్రతిసారి జావాస్ర్కిప్ట్ ఆటోమెటిక్‌గా డిసేబుల్ అయ్యే విధంగా బ్రౌజర్ సెట్టింగ్స్‌ను గూగుల్ అప్‌డేట్ చేయబోతోంది. 2జీ మొబైల్ ఇంటర్నెట్ సమయంలో జావా స్క్రిప్ట్ ను డిసేబుల్ చేయటం వల్ల వెబ్ పేజెస్ అనేవి చాలా వేగంగా లోడ్ అవటంతో పాటు డేటా కూడా సేవ్ అవుతుంది. 2జీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కారణంగా వెబ్ బ్రౌజింగ్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించ లేకపోతోన్న నేపథ్యంలో గూగుల్ ఈ పరిష్కార మార్గాన్ని తీసుకువచ్చింది.

జావా స్క్రిప్ట్ ను డిసేబుల్ చేయటం వల్ల..
2జీ ఇంటర్నెట్ సమయంలో జావాస్ర్కిప్ట్‌ను డిసేబుల్ చేయటం వల్ల వెబ్ పేజెస్ అనేవి చాలా వేగంగా లోడ్ అవటంతో పాటు డేటా కూడా సేవ్ అవుతుంది. వెబ్‌సైట్‌లలో మల్టీమీడియా కంటెంట్‌తో పాటు ప్లగ్గిన్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ సమయంలో వెబ్ పేజెస్ లోడ్ అవటానికి చాలా సమయం తీసుకుంటోంది. ఈ సమస్యను ఉద్దేశించి గతంలోనే ‘నో స్క్రిప్ట్ ' పేరుతో ఈ ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది.

ఇప్పుడది ఆటోమెటిక్‌గా...
ఈ ఫీచర్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ సమయంలో జావాస్క్రిప్ట్ ను పూర్తిగా డిసేబుల్ చేసేస్తుంది. దీంతో కావల్సిన కంటెంట్ మాత్రమే లోడ్ అవుతుంది. అయితే ఇప్పుడది ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో క్రోమ్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచేందుకుగాను లేజీ లోడింగ్ పేరుతో ప్రయోగాత్మక ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టబోతోంది.

త్వరలో మరో కొత్త ఫీచర్..
మరికొద్ది రోజుల్లో అఫీషియల్‌గా అందుబాటులోకి రాబోతోన్న ఈ ఫీచర్ వెబ్ పేజీలను చాలా వేగంగా లోడ్ చేయగలుగుతుంది. ఈ లేజీ లోడింగ్ ఫీచర్ అనేది వెబ్ పేజీని రెండు భాగాలుగా విభజిస్తుంది. అబౌ ద ఫోల్డ్, బిలౌ ద ఫోల్డ్ పేర్లతో ఈ భాగాలు కనిపిస్తాయి.

డేటా ఆదా అవటంతో పాటు కంటెంట్ కూడా వేగవంతంగా లోడ్ అవుతుంది..
అబౌ ద ఫోల్డ్ భాగంలో ఫోటోలతో పాటు ఇతర ముఖ్యమైన కంటెంట్ లోడ్ అవుతుంది. బిలౌ ద ఫోల్డ్ భాగంలో వెబ్ పేజీకి సంబంధించి ఇతర సమచారం లోడ్ అయి ఉంటంది. వీటిలో కావల్సిన సమాచారాన్ని మాత్రమే వినియోగించుకోవచ్చు. దీంతో డేటా ఆదా అవటంతో పాటు కంటెంట్ కూడా వేగవంతంగా లోడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








