సరిక్రొత్త లోకంలోకి 'గూగుల్ ప్లస్ సర్కిల్స్'

Posted By: Super

సరిక్రొత్త లోకంలోకి 'గూగుల్ ప్లస్ సర్కిల్స్'

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా ప్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ సర్కిల్స్ పేజిని యూజర్స్‌కు మరింత దగ్గర చేర్చడంతో పాటు.. కొత్త స్నేహితులను ఈజీగా కనుగోనేందుకు సర్కిల్స్‌కి కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ సీన్ పుర్సెల్ మాట్లాడుతూ గూగుల్ ప్లస్ సర్కిల్స్‌ని మరింత నాణ్యంగా మెరుగుపరచడంతో పాటు.. బ్లాగ్ పోస్ట్‌లకు ఉపయోగించేందుకు అనుకూలంగా తయారు చేశామని అన్నాడు.

కొత్తగా రూపుదిద్దుకోనున్న సర్కిల్స్ పేజిలో ఎడమ వైపున ఉన్న నావిగేషన్ మెను యూజర్స్ అడ్రస్ బుక్ ద్వారా ఈజీగా ఈమెయిల్స్ పంపోచ్చు. అంతేకాకుకండా యూజర్స్ చిన్న స్క్రీన్ కలిగిన కంప్యూటర్స్‌ని ఉపయోగించినప్పుడు సర్కిల్స్ పరిమాణం అటోమ్యాటిక్‌గా కుదించడతాయి. దీనితో పాటు గూగుల్ ప్లస్‌లో చాలా మార్పులు చేశామని తెలిపారు.

ముఖ్యంగా యూజర్స్ గమనించినట్లేతే ఫైండ్ పీపుల్ సెర్చ్ ఫీచర్‌ని పూర్తిగా మార్చి వేయడం జరిగిందన్నారు. ఇప్పుడున్న సెర్చ్ ఫీచర్‌లో కేవలం యూజర్ పేరుని బట్టి సెర్చ్ చేయవచ్చని తెలిపారు. మీ సర్కిల్స్‌కి సంస్థలు మరియు వ్యక్తుల కుడా జోడించ వచ్చనే ఆలోచనను సూచిస్తుంది. ఇటీవలే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌లో ‘గూగుల్‌ వద్ద జీవితం’ పేజిని ప్రారంభించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ప్రొపైల్స్‌ని కలిగి ఉన్న వారు ‘గూగుల్‌ వద్ద జీవితం’ పేజిని షేర్ చేసుకోవచ్చని అన్నారు. యూజర్స్ ఈ పేజిలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతో పాటు, వాతావరణం, సంస్కృతి మొదలగున వాటికి సంబంధించి పోస్ట్ చేయవచ్చు.

గూగుల్ వద్ద జీవితం ఎకౌంట్స్‌ని గూగుల్ కంపెనీ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఫాలో అవ్వోచ్చని తెలిపింది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ గూగుల్ ప్లస్‌ని ‘బేబి’ లాగా  చూసుకుంటుంది. గూగుల్ వద్ద జీవితం ఎకౌంట్ గూగుల్ సోషల్ మీడియాలో త్వరలో అత్యంత కీలక పాత్రని పోషించనుంది. గూగుల్ అధికారకంగా గూగుల్ వద్ద జీవితం పేజి గురించి సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot