గూగుల్ క్లిప్స్.. మార్కెట్లోకి మరో అద్బుతమైన కెమెరా

|

ఫీల్డ్ ఫోటోగ్రఫీకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించి సరికొత్త ఆవిష్కరణకు గూగుల్ ఊపిరి పోసింది. Clips పేరుతో ఓ ఇన్నోవేటివ్ కెమెరాను గూగుల్ సంస్థ మార్కెట్లో లాంచ్ చేసింది.

గూగుల్ క్లిప్స్.. మార్కెట్లోకి మరో అద్బుతమైన కెమెరా

 

పాకెట్ సైజ్ పరిమాణంలో ఉండే ఈ కెమెరా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో మనకు తెలియకుండానే, మనకు సంబధించిన సహజసిద్ధమైన మూమెంట్స్‌ను ఫోటోస్ అలానే వీడియోస్ రూపంలో బంధిస్తుంది.

ఫోటోస్ అలానే వీడియోస్‌లో సహజత్వాన్ని కోరుకునే వారికి ఈ క్లిప్స్ కెమెరా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఈ హోమ్ కెమెరాను లివింగ్ రూమ్‌లో అమర్చి ఉంచితే చాలు, దాని పని అదే చేసుకుపోతుంది. క్లిప్స్ కెమెరాలో డిస్‌ప్లే, వ్యూఫైండర్ వంటి సౌకర్యాలు ఉండవు. ఈ కెమెరా నేరుగా యూజర్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. క్యాప్చుర్ అయిన కంటెంట్‌ను నేరుగా స్మార్ట్‌ఫోన్‌లోనే వీక్షించుకునే వీలుంటుంది.

ఈ తరహా సాంకేతికతతో పలు యాక్షన్ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికి క్లిప్స్ కెమెరాతో వాటిని పోల్చి చూడలేం. క్లిప్స్ కెమెరాను ఇంటి అవసరాల కోసం గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ కెమెరాను ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకునే వీలుంటుంది.

ఈ సారి జియో ఫోన్‌కి షాక్ ఇచ్చేది నోకియా ఫోనేనా..?

వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో వస్తోన్న ఈ కెమెరా గది మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. రియల్ టైమ్ వీడియోలతో పాటు స్లోమోషన్ వీడియోలను కూడా ఈ కెమెరా క్యాప్చుర్ చేయగలుగుతుంది. రిటైల్ మార్కెట్లో గూగుల్ క్లిప్స్ కెమెరా ధర 249 డాలర్లు (మన కరెన్సీలో ఈ విలువ రూ.16,000). ఇండియన్ మార్కెట్లో గూగుల్ క్లిప్స్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google launched a pocket-sized camera that uses Artificial Intelligence to capture moments automatically. It is named as Google Clips and will debut soon.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more