గూగుల్ రీడర్ మూసివేత!

|

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన ఉచిత రీడర్ సర్వీసు అయిన ‘గూగుల్ రీడర్'ను సోమవారం మూసివేసింది. ఈ నేపధ్యంలో పలువురు ప్రత్యామ్నాయ మార్గాలుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు అయిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్‌లను ఆశ్రయిస్తున్నారు. గూగుల్ రీడర్‌ను కొసాగించాలని కోరుతూ change.org చేపట్టిన ‘కీప్ గూగుల్ రీడర్ రన్నింగ్' సంతకాల కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కు 154,000 సంతకాలు అందాయి. ఈ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న మరో పిటీషన్ ‘డోంట్ కిల్ గూగుల్ రీడర్' కార్యక్రమానికి 7,598 మంది మద్దతు పలికారు. గూగుల్ రీడర్ మూతబడటంతో ఫీడ్లీ, డిగ్ రీడర్, న్యూస్ బ్లర్, ఫ్లిప్‌బోర్డ్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు పుంజుకుంటున్నాయి. 2005 అక్టోబర్‌లో ప్రారంభించబడిన గూగుల్ రీడర్‌కు కొద్ది కాలంలోనే మిలియన్ల సంఖ్యలో ప్రజానీకం చేరువయ్యారు.

 

గూగుల్ రీడర్ గురించి క్లుప్తంగా:

గూగుల్ రీడర్ అనేది ఒక ఆన్‌లైన్ ఉపకరణం. న్యూస్ వెబ్‌సైట్‌లు ఇంకా ఇతర బ్లాగుల్లో ప్రచురించే సరికొత్త సమచారాన్ని తెలుసుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు ఎంపిక చేసుకునే వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ఆర్ఎస్ఎస్ లేదా ఆటోమ్ ఫీడ్ సౌలభ్యతను కలిగి ఉన్నట్లయితే గూగుల్ రీడర్ వాటిని సపోర్ట్ చేస్తుంది. గూగుల్ రీడర్‌లోకి ప్రవేశించేందుకు గూగుల్ అకౌంట్ అవసరమవుతుంది.

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ సర్వీసును అక్టోబర్ 7, 2005న ప్రారంభించటం జరిగింది. ఈ కంటెంట్ అప్లికేషన్‌ను గూగుల్ డిజైనర్ క్రిస్ వెతరిల్ 2005లో తయారు చేసారు.

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూసివేత!

ప్రారంభించబడిన అనతి కాలంలోనే గూగుల్ రీడర్ లక్షలాది మంది అభిమానులకు చేరువయ్యింది. న్యూస్ వెబ్‌సైట్‌లు ఇంకా ఇతర బ్లాగుల్లో ప్రచురించే సరికొత్త సమచారాన్ని తెలుసుకునేందుకు గూగుల్ రీడర్‌ను అత్యధిక మంది ఉపయోగించేవారు.

 

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూసివేత!

మార్చి 13, 2013న గూగుల్ రీడర్ సర్వీస్‌ను జూలై 1 నుంచి నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ వార్త గూగుల్ అభిమానులను తీవ్ర నిరాశకు లోనుచేసింది.

గూగుల్ రీడర్ మూసివేత!
 

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్‌ను కొసాగించాలని కోరుతూ change.org చేపట్టిన ‘కీప్ గూగుల్ రీడర్ రన్నింగ్' సంతకాల కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కు మద్దతుగా 154,000 సంతకాలు అందాయి. ఈ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న మరో పిటీషన్ ‘డోంట్ కిల్ గూగుల్ రీడర్' కార్యక్రమానికి 7,598 మంది మద్దతు పలికారు.

 

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూతబడటంతో ఫీడ్లీ, డిగ్ రీడర్, న్యూస్‌బ్లర్, ఫ్లిప్‌బోర్డ్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు పుంజుకునే అవకాశం ఉంది.

గూగుల్ రీడర్ మూసివేత!

గూగుల్ రీడర్ మూసివేత!

జూలై 1, గూగుల్ రీడర్ సర్వీసును నిలిపివేస్తూ గుగూల్ చర్యలు తీసకుంది. గూగుల్ రీడర్‌కు ప్రత్యామ్నాయంగా గూగుల్ మరో సర్వీసును వీలైనంత త్వరగా  అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిద్దాం

న్యూస్ పేపర్‌లను పరిచయం చేయనున్న గూగుల్..?

గూగుల్ రీడర్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేసి లక్షల మంది అభిమానులను నిరుత్సాహాపరిచిన గూగుల్ త్వరలో న్యూస్ పేపర్ అప్లికేషన్ పేరుతో సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ వార్త గూగుల్ ఆండ్రాయిడ్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ తాజా న్యూస్ అప్లికేషన్‌తో రీడర్ల సంఖ్యను తిరిగి రాబట్టుకోవాలని గూగుల్ భావిస్తున్నట్లు సమాచారం. ‘న్యూస్ స్టాండ్' పేరుతో యాపిల్ కొత్త న్యూస్ సర్వీస్‌ను యాపిల్ ఇటీవల ప్రారంభించిన నేపధ్యంలో గూగుల్ కొత్త న్యూస్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు సమాయుత్తమవటం మార్కెట్లో హాట్ టాపిక్‌లా మారింది. గూగుల్ ప్రవేశపెట్టబోతున్న ‘గూగుల్ ప్లే న్యూస్' అప్లికేషన్‌ను పొందుగోరే వారు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ వినియోగదారుడై ఉండాలి. ఆండ్రాయిడ్ యూజర్ ఈ అప్లికేషన్ ఆధారంగా తమకు నచ్చిన న్యూస్ ఎడిషన్‌లను నెలలేదా సంవత్సర చందాలను చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. అప్లికేషన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X