Home
News

Is Your Phone Safe : స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారా.. అయితే ఈ కీలక సమాచారం మీకోసమే..!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఒకరకంగా కలవరపాటుకు గురిచేసే నివేదిక ఇది. ఎందుకంటే గతంలో స్మార్ట్‌ఫోన్‌ కేవలం కమ్యూనికేషన్ డివైజ్‌ మాత్రమే, కానీ ఇప్పుడు కాల్స్‌, బ్యాంకింగ్ పనులు, ‌బ్రౌజింగ్‌, సోషల్‌ మీడియా సహా అనేక పనులకు కీలకంగా మారింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు, మీటింగ్స్‌ కూడా ఫోన్‌ ద్వారా సులభంగా పూర్తి చేస్తున్నాం. అయితే గూగుల్‌ (Google) తాజా నివేదిక చాలా మందిని ఆలోచనలో పడేసింది.

కొంత మంది తరచూ స్మార్ట్‌ఫోన్‌లను మారుస్తూ ఉంటారు. అయితే మరికొంత మంది మాత్రం ఒకే ఫోన్‌ ను చాలా కాలంపాటు వినియోగిస్తుంటారు. ఎక్కువ సంవత్సరాల పాటు ఫోన్‌ వినియోగిస్తున్న వారికి భద్రతాపరంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

google android security report 2026

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ కొన్ని సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను అందిస్తుంటాయి. ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందుకుంటున్నాయి. అయితే మిడ్‌ రేంజ్‌ సహా ఇతర మోడల్స్‌ 2 నుంచి 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతున్నాయి.

అప్‌డేట్స్‌ రావడం ఆగిపోయాక కూడా స్మార్ట్‌ఫోన్‌ లు చాలా కాలం వరకు సక్రమంగానే పనిచేస్తాయి, కానీ భద్రతా పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హ్యాకింగ్‌ వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ప్రస్తుతం సమాచారం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతానికి పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు భద్రతపరంగా ముప్పు ఉంది.

రిస్క్‌లో వంద కోట్ల ఫోన్‌లు! :
గూగుల్‌ చెబుతున్న వివరాల ఆధారంగా వంద కోట్ల కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు మాల్వేర్‌, స్పైవేర్‌ వంటి సైబర్‌ ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆండ్రాయిడ్‌ 12 లేదా అంతకంటే పాత OS వెర్షన్‌ లపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు కీలకమైన సిస్టమ్‌ లెవల్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందుబాటులో ఉండవని గూగుల్‌ చెబుతోంది.

దీంతో ఈ ఫోన్‌లకు సైబర్‌దాడుల నుంచి భద్రత లేకుండా పోతుంది. అయితే గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్ ఫీచర్‌ ఉన్నా.. మాల్వేర్‌ ను అడ్డుకొనేందుకు మాత్రమే పనికొస్తుంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (OS) స్థాయిలో తలెత్తే లోపాలను సరిచేయలేదు. OS స్థాయిలో వచ్చేలోపాలను సిస్టమ్‌ అప్‌డేట్స్‌తో మాత్రమే అడ్డుకొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది.

మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌ OS వివరాలు ఎలా తెలుసుకోవాలి? :
మీరు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ సురక్షితమైనతో కాదో తెలుసుకొనేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అనంతరం About Phone పైన క్లిక్‌ చేయండి. మీ ఫోన్ ఆండ్రాయిడ్‌ 12 లేదా అంతకంటే పాత వెర్షన్‌పై పనిచేస్తుంటే.. వీలైనంత త్వరలో కొత్త ఫోన్‌ కొనుగోలు చేయడం ఉత్తమం.

కొత్త ఫోన్ కొనుగోలు చేసేంత వరకు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. అనుమానిత లింక్స్‌, APK ఫైల్స్ జోలికి వెళ్లకండి. ఇలాంటి ఫోన్‌లతో బ్యాంకింగ్‌ యాప్‌లను వినియోగించవద్దు. సోషల్ మీడియా ఖాతాలకు తప్పనిసరిగా టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ను యాక్టివేట్‌ చేసుకోండి. దీంతోపాటు ఫోన్‌లో ఉన్న బ్రౌజర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google confirmed 40 percent of android devices currently not getting system level security updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X