గూగుల్ 13వ పుట్టినరోజే గూగుల్ డూడుల్ ప్రత్యేకత

Posted By: Staff

గూగుల్ 13వ పుట్టినరోజే గూగుల్ డూడుల్ ప్రత్యేకత

ఒక అందమైన రూమ్‌లో తెల్లని కేక్. ఆ కేక్ పైన రంగు రంగుల కొవ్వొత్తులు. ఆ కొవ్వొత్తుల చుట్టూ చిన్న చిన్న గిప్ట్స్, గూగుల్ అని రాసిన అక్షరాలు. దానికి వెలుపల వైపున బెలూన్స్. ఏంటీ ఇదంతా అని అనుకుంటున్నారా.. ఈరోజు పొద్దునే ఆఫీసుకి వచ్చి సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్‌ని ఓపెన్ చేయగానే వచ్చిన గూగుల్ డూడుల్. అరరే ఇదేంటని దానిపైన మౌస్ పాయింటర్ పెట్టగానే తెలిసిన విషయం ఏమిటంటే 'ఈరోజు సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన 13వ పుట్టిన రోజుని జరుపుకుటుందని' మరి ఇంకెందుకు ఆలస్యం నాలాగే టెక్నాలజీ అంటే అభిమానం కలిగిన యూజర్స్ కోసం ప్రత్యేకంగా దీని గురించి మీకు తెలియజేస్తున్నాను.

సాధారణంగా గూగుల్ ఎవరైనా సెలబ్రటీ, ప్రపంచాలను విజ్ఞానాన్ని అందించిన ప్రముఖుల పేర్లు మీద గూగుల్ డూడుల్ పెట్టిన సందర్బాలు అనేకం మనం చూశాం. సరిగ్గా మన సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా 13వ వసంతంలోకి అడుగు పెట్టడంతో ఇలా వెరైటీగా తన పుట్టినరోజుని చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ అంటే కేవలం గూగుల్ అనుకునే వారు కూడా ఉన్నారనడంలో ఎటువంటి సందేహాం లేదు.

మనకు కావాల్సిన సమాచారాన్ని సెర్చ్ చేయాగానే అతి తక్కువ కాలంలో మన ముందు ఉంచుతుంది మన గూగుల్ మహాశయ. టెక్నాలజీపై అవగాహానఉన్న వారు గూగుల్‌ని ముద్దుగా 'గూగుల్ మహాశయ' అని పిలుస్తుంటారు. 2003వ సంవత్సరంలో గూగుల్ తన మొట్టమొదటి గూగుల్ డూడుల్‌ని హోం పేజిపై ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా 2003వ సంవత్సరంలో గూగుల్ తన పుట్టినరోజుని సెప్టెంబర్ 7వ తారీఖున జరుపుకోగా, కొన్ని కారణాల వల్ల దానిని 2004 నుండి సెప్టెంబర్ 27న జరుపుకొవడం చేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot