ఎం.ఎస్ సుబ్బలక్ష్మి 97వ జన్మదిన వేడుకలను జరుపుకున్న ‘గూగుల్’

Posted By:

ఆమె సంగీత ఆధ్యాత్మిక స్వరం తెలుగుజాతికి ఓ వరం. ఆమె పాడిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువారి గుండెల్లో భక్తిభావాలను ప్రసరింప చేస్తుంది. నిండైన భారతీయ సంస్కృతికి ఆ సుమధుర గాయని నిలువెత్తు నిదర్శనం. ఆమె ప్రముఖ గాయని ‘ఎం.ఎస్ సుబ్బలక్ష్మి'.

ప్రతిష్టాత్మక భారతర్నత పురస్కారాన్ని అందుకున్న తొలి గాయకురాలిగా చరత్రి సృష్టించిన మహోన్నత గాయని మధురై షుణ్ముకవడివు సుబ్బలక్ష్మి (ఎం.ఎస్. సుబ్బలక్ష్మి) 97వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకని సోమవారం గూగుల్ తన హోమ్ పేజీ పై ప్రత్యేక డూడుల్‌ను పోస్ట్  చేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎం.ఎస్ సుబ్బలక్ష్మి 97వ జన్మదిన వేడుకలను జరుపుకున్న ‘గూగుల్’

ఆధ్యాత్మిక స్వరధార ఎం.ఎస్ సుబ్బలక్ష్మి 1916 సెప్టంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురై రాష్ట్రంలో జన్మించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఆదిగురువు ఆమె తల్లి షణ్ముఖవడివు అమ్మల్ ఆది గురువు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆత్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది.

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా సుబ్బ‌లక్ష్మి చరిత్ర సృష్టించారు. ఆ సందర్భంలో ‘న్యూయార్క్ టైమ్స్ పత్రిక' సుబ్బలక్ష్మిని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతూ ఓ కథనాన్ని కూడా ప్రచరించటం జరిగింది. సంగీత ప్రపచంలో అనేక పురస్కారాలు సుబ్బలక్ష్మిని వరించాయి. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు సుబ్బలక్ష్మి గాత్రంలోని మాధుర్యానికి దాసోహమవక తప్పలేదు.

కొన్ని దశాబ్థాల పాటు తన గాత్రంలో పులకింప చేసిన సంగీత స్వరధార ఎం.ఎస్ సుబ్బలక్ష్మి 2004, డిసెంబర్ 11న ఆనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కాని ఆమె గొంతు మాత్రం ఈ విశ్వం ఉన్నంత కాలం ప్రపంచమంతటా మారుమోగుతూనే ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot