కామన్ మెన్‌కి గూగుల్ నివాళి

Written By:

మన కామన్ మెన్ కి ఇంటర్నెట్ సెర్చ్ గూగుల్ తనదైన రూపంలో నివాళి అర్పించింది. ఆయన 94వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను గూగుల్ డూడుల్ గా పెట్టి ఘనంగా తన భక్తిని చాటుకుంది. తన డెస్క్ వద్ద దీక్షగా పనిచేసుకుంటున్న ఆర్కే లక్ష్మణ్, ఆయన కార్టూన్ కేరెక్టర్ 'కామన్ మేన్' లు కలిసి ఉన్న చిత్రాన్ని డూడుల్ గా రూపొందించింది. ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితులు అయిన ఈ కామన్ మేన్ సృష్టికర్త పూర్తి పేరు రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్.

Read more: ట్విట్టర్ ఉద్యోగులకు షేర్ల గాలం

ఆయన అక్టోబర్ 23, 1924లో మైసూర్ లో జన్మించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు. కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానం కల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు. ఆయన జనవరి 26న పూనేలో మరణించారు. ఈ సంధర్భంగా ఆయన కార్టూన్స్ ని ఓ సారి గుర్తు చేసుకుందాం. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇందిరాగాంధీ కార్టూన్

నవంబర్ 1978న గీసిన కార్టూన్ ఇది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో వచ్చిన ఎన్నికల సంధర్భంగా గీసిన కార్టూన్ ఇది.

సల్మాన్ ఖాన్ హిట్ కేసు

సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు సంధర్భంగా గీసిన కార్టూన్. రోడ్డు మధ్యలో పడుకుంటే మీరు సేఫ్ గా ఉంటారంటూ కార్టూన్ గీశారు. అందరి ప్రశంసలు అందుకుంది.

గుజరాత్ రిలీప్ ఫండ్

గుజరాత్ లో రిలీఫ్ ఫండ్ కోసం గీచిన కార్టూన్. అందరి హార్ట్ టచ్ చేసింది.

శివసేన బిజెపి రిలేషిన్ షిప్ కార్టూన్

1990లో గీచిన కార్టూన్. బిజెపి శివసేనల మధ్య సీట్ల సర్ధుబాటులో తేడా వచ్చినప్పుడు బాల్ థాఖరే ఇక్కడ సీటు ఖాళీ లేదంటూ చూపే చిత్రం

జయప్రకాశ్ నారాయణ్ సేవ్ డెమెక్రసీ

1967లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నారాయణ్ చేపట్టిన దీక్ష పై గీచిన కార్టూన్

పెట్రోలు రేట్లు పెరిగిన తరుణంలో గీచిన కార్టూన్

పెట్రోలు రేట్లు పెరిగిన తరుణంలో గీచిన కార్టూన్ 

మహాత్మాగాంధీపై గీచిన కార్టూన్

మహాత్మాగాంధీపై గీచిన కార్టూన్ 

జవహర్ లాల్ నెహ్రూపై గీచిన కార్టూన్

జవహర్ లాల్ నెహ్రూపై గీచిన కార్టూన్ 

గూగుల్ డూడుల్

గూగుల్ డూడుల్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google doodle celebrates RK Laxman s 94th birthday
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot