గూగుల్ హోం పేజి గూగుల్ డూడుల్ సమాచారం..!!

Posted By: Staff

గూగుల్ హోం పేజి గూగుల్ డూడుల్ సమాచారం..!!

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ సెలబ్రిటీల గుర్తుగా ప్రత్యేకంగా 'గూగుల్ డూడుల్' ని పెట్టడం మనం చాలా సార్లు చూశాం. ఈరోజు కూడా గూగుల్ ఓ సరిక్రొత్త కలర్ పుల్ డూడుల్‌తో హోం పేజీతో ఆవిష్కరించింది. ఈరోజు ఈ స్టోరీని వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది..

క్లే యానిమేషన్‌లో గొప్ప అనుభవజ్ఞుడైన 'ఆర్ట్ క్లోకీ' 90వ పుట్టినరోజుని సంతరించుకొని గూగుల్ హోం పేజిపై క్లే బాల్స్ తో ఈ డూడుల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డూడుల్‌లో క్లోకీ క్రియేషన్స్‌కి అనుగుణంగా నిర్మించడం జరిగింది. 'గుంబే షో'లో క్లోకీ తన యానిమేషన్‌ని ఏవిధంగా తీర్చి దిద్దాడో అదే విధంగా ఇక్కడ రూపొందించడం జరిగింది. నవంబర్ 1955లో అంటే ఇప్పటికీ 35సంవత్సరాల క్రితం 'గుంబే షో' అంటే చాలా పాపులర్.

గూగుల్ హోం పేజిలోకి వెళ్లి అక్కడున్న క్లే బాల్స్‌పై ఒక్కసారి గనుక యూజర్స్ క్లిక్ చేసినట్లేతే 'గుంబే షో'లో క్యారెక్టర్స్ ఏవిధంగానైతే పాత్రలను పోషించాయో అదే విధంగా అవి కదలడం జరుగుతుంది. క్లోకీ 90వ పుట్టిన రోజు సందర్బంగా అతను చేసినటువంటి సేవలు తిరిగి ప్రజలు గుర్తుంచుకొనే విధంగా క్లేబాల్స్ తో అతనికి డూడుల్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.

'గుంబే షో'లో ఉన్న పాత్రలు: ఈ షోలో హీరో గుంబే( ఓరిజినల్ క్లేబాయ్), పోకీ(గుంబే బెస్ట్ ప్రెండ్), బ్లాక్ హెడ్స్(డూడుల్‌లో జి, జె) వీరిద్దరూ ఎప్పుడూ గుంబే‌ కి ప్రాబ్లమ్స్‌ని ఉత్పన్నం చేస్తుంటారు. తారా(గుంబే గర్ల్ ప్రెండ్), ప్రికిల్(గుంబే‌కి మంచి స్నేహితుడు).

క్లోకీ అక్టోబర్ 12, 1921లో జన్మించారు. 88 సంవత్సరాల వయసులో జనవరి 8, 2010లో మరణించారు. ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి మూడు నిమిషాలు నిడివి కలిగిన క్లే షార్ట్ ఫిల్మ్‌(గుంబాసియా)ని ప్రారంభించిన ఘనత క్లోకీ ది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్నహీరో పాత్ర 'గుంబే'.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot