ఈ రోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకం లెస్ పాల్ ఎలక్ట్రానిక్ గిటార్

Posted By: Super

ఈ రోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకం లెస్ పాల్ ఎలక్ట్రానిక్ గిటార్

కాలిఫోర్నియా: వెబ్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొంత మంది వ్యక్తుల విశిష్టతను తెలియజేస్తూ వారిమీద గూగుల్ డూడుల్ పెట్టడం మనం చూశాం. ఐతే ఈరోజు గూగుల్ ప్రతిష్టాత్మకంగా మ్యూజిషన్స్ డూడుల్ పెట్టడం హార్షనీయం. ఈరోజు సోమవారం జూన్ 9న గూగుల్ డూడుల్‌లో ఉంచినటువంటి గిటార్ లెజండరీ జాజ్ గిటారిస్ట్, సాంగ్ రైటర్ లెస్ పాల్ చిహ్నాంగా అతను వాడినటువంటి ఎలక్ట్రానిక్ గిటార్.

లెస్ పాల్ 96వ పుట్టిన రోజు సందర్బంగా గూగుల్ ఈరోజు అతని స్మారకార్దం ఈ గిటార్‌ని డూడుల్‌గా పెట్టడం జరిగిందని తెలిపారు. లెస్ పాల్ చేసినటువంటి ఎక్స్‌పరమెంట్స్ ప్రపంచం మొత్తం ఉన్నటుంటి అభిమానులను ఆకట్టుకున్నాయి. లెస్ పాల్ ముఖ్యంగా ఓవర్ డబ్బింగ్, డిలే ఎఫెక్ట్స్, మల్టీ ట్రాకింగ్ రికార్డింగ్‌కి పెట్టింది పేరు. గూగుల్ డూడుల్‌‌ని గనుక మనం చూసినట్లైతే గిటార్ స్ట్రింగ్స్‌తో దానిమీద మౌస్ పాయింటర్ గనుక పెట్టినట్లేత్ కలర్స్ వేరియేషన్స్‌తో కనువిందు చేస్తుంది. మనం గనుక ఆ గూగుల్ డూడుల్ మీద క్లిక్ చేసినట్లేతే లెస్ పాల్ గురించిన సమాచారం సెర్చ్ రిజల్స్‌లో వస్తుంది.

సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్‌ని గనుక మనం చూసినట్లైతే ఇలాంటి స్పెషల్ రోజులని, స్పెషల్ అకేషన్స్‌ని మన అందరికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తానికి సుపరిచితుడైన కామెడీ యాక్టర్ చార్లీ చాప్లిన్ యొక్క 122వ పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ వీడియాని గూగుల్ డూడుల్ ఉంచిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot