పాఠకులకు ప్రేమికుల దినోత్సవ 'స్పెషల్ గూగుల్ డూడుల్ '..

Posted By: Staff

పాఠకులకు ప్రేమికుల దినోత్సవ 'స్పెషల్ గూగుల్ డూడుల్ '..

 

'ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం'. ఈ రోజుని పురస్కరించుకోని సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఓ సరిక్రొత్త వీడియో డూడుల్‌ని గూగుల్ హోం పేజిపై ప్రదర్శించింది. ఈ డూడుల్‌ యానిమేషన్ ఫ్యాషన్‌తో రూపొందించబడిన ఓ అబ్బాయి లవ్ స్టోరీ. ఈ వీడియోలో తను ప్రేమించిన ప్రేయసిని లాలించే విధానం ముద్దోచ్చే విధంగా ఉంటుంది. ఈ వీడియోని ప్రముఖ యానిమేషన్ మేకర్ టోనీ బెన్నెట్ రూపొందించారు. ఈ వీడియో టైటిల్ 'కోల్డ్, కోల్డ్ హార్ట్ క్లాసిక్ బ్లూస్'.

Read In English:

గూగుల్ లోగో బ్యాక్ గ్రౌండ్ వెనుక భాగాన ఓ బాలుడు వాలెంటైన్‌తో ఉంటాడు. వాలెంటైన్ మీద యూజర్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి హ్యాపీ వాలెంటైన్లు డే సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కోల్డ్, కోల్డ్ హార్ట్ ప్రదర్శనను టోనీ బెన్నెట్ రూపొందించారు. వీడియోని ఇచ్చిన వారు: సోనీ / ఎటివి మరియు కొలంబియా రికార్డ్స్.

 

సాధారణంగా గూగుల్ ఎప్పుడూ డూడుల్‌గా ఇమేజిలను ప్రదర్సిస్తూ ఉంటుంది. కానీ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకోని.. వీడియోని గూగుల్ హోం పేజి మీద ప్రదర్శనకు ఉంచింది. ఇటీవలే మ్యూజిక్ లెజెండ్ రాక్ స్టారైన ప్రెడ్డీ మెర్కురీ జ్ఞాపకార్దం సెప్టెంబర్ 5, 2011న మ్యూజిక్ వీడియోని ప్రదర్శనకు ఉంచిన విషయం తెలిసిందే. చార్లీ చాఫ్లెన్ 122వ పుట్టిన రోజుని పురష్కరించుకోని మొట్టమొదటి సారి గూగుల్ కంపెనీ వీడియోని పెట్టడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot