ఫాదర్ ఆఫ్ కంప్యూటింగ్ (నేటి గుగూల్ హోమ్ పేజ్ విశిష్టత)

Posted By: Prashanth

ఫాదర్ ఆఫ్ కంప్యూటింగ్ (నేటి గుగూల్ హోమ్ పేజ్ విశిష్టత)

 

ఫాదర్ ఆఫ్ కంప్యూటింగ్ అలెన్ మాటీసన్ ట్యూరింగ్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్చ్ ఇంజిన్ గుగూల్ నేటి గుగూల్ హోమ్ పేజీ పై 1936లో ఆయన డిజైన్ చేసిన ‘కంప్యూటింగ్ మెచిన్’ను ప్రచురించింది. అలెన్ కనుగొన్న కంప్యూటింగ్ మెచిన్, కంప్యూటర్ అల్గోరిథం యొక్క తర్కశాస్త్రాన్ని ఉద్దీపన చెయ్యటంతో పాటు సీపీయూ పనితీరును వివరించటంలో సహాయపడుతుంది. వృత్తి రిత్యా ఆంగ్ల గణిత పండితుడైన అలన్ ట్యూరింగ్ 1912, జూన్ 23వ తేదీన లండన్‌లో జన్మించారు. ఈయన తండ్రి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసేవారు.

1934లో కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్ర పట్టాను పొందిన అలెన్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వపు కోడ్ అండ్ సిఫెర్ స్కూల్‌లో తర్ఫీదు పొందారు. అనంతరం, జర్మన్లు ​​ఉపయోగించే నిగూఢ సందేశాలను విచ్ఛిన్నం చేసే భద్రతాధికారిగా ట్యూరింగ్‌ను బ్రిటీష్ ప్రభుత్తం నియమించింది. యుద్ధం ముగిసిన తరువాత నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ చేరిన టర్నింగ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌ను వృద్ధి చేశారు.

అనంతరం కంప్యూటింగ్ మెచిన్ ప్రయోగశాలలో అనేక పరిశోధనలు జరిపి తొలి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్‌ను ‘ఫెర్రాంటి మార్క్ 1’ పేరుతో ప్రపంచానికి అందించారు. కృత్రిమ మేధస్సు విభాగానికి మార్గదర్శకునిగా నిలిచిన ట్యూరింగ్ 1952లో స్వలింగ సంపర్క అభియోగం కింద చికిత్స పొందారు. 1954, జూన్ 7న అలెన్ ట్యూరింగ్ సైనేడ్ విషప్రయోగం చేత తుదిశ్వాస. ఈ చరిత్రకారుడి ప్రతిభకు గుర్తింపుగా కంప్యూటింగ్ సైన్స్‌లో అత్యధిక ఘనతను కనబర్చిన వారిని ట్యూరింగ్ అవార్డు పేరుతో సత్కరించడం ఆనవాయితీగా మారింది. ఈ అవార్డును నోబుల్ ప్రైజ్ ఆఫ్ కంప్యూటింగ్‌గా అభివర్ణిస్తారు. ఈ బహుమతికి ప్రాయోజకులుగా గుగూల్, ఇంటెల్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot