ఒలంపిక్స్ రెండో రోజు ప్రత్యేకం (గుగూల్ డూడుల్)

Posted By: Prashanth

ఒలంపిక్స్ రెండో రోజు ప్రత్యేకం (గుగూల్ డూడుల్)

 

విశ్వక్రీడగా గుర్తింపుతెచ్చుకున్న ఒలింపిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సెర్చ్ ఇంజన్ గుగూల్ శుక్రవారం లండన్‌లో ఆ క్రీడల ఆరంభోత్సవాన్ని పురస్కరించుకుని తన హోమ్ పేజీ పై ఒలింపిక్స్ డూడుల్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ 30వ ఒలంపిక్ క్రీడ్లలో భాగంగా రెండో రోజును పురస్కరించుకుని ‘లండన్ 2012 ఆర్చరీ’ డూడుల్‌ను గుగూల్ తన హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. ప్రసిద్ధ లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఓ మహిళా ఆర్చర్ లక్ష్యాన్ని గురి చేస్తున్న తీరును ప్రతిబింబిస్తూ రూపుదిద్దుకున్న ఆ ప్రతిమ ఒలింపిక్స్ శోభను మరింత ఉట్టిపడేలా చేస్తుంది.

ఒలంపిక్స్‌కు సంబంధించి డూడుల్స్‌ను పోస్ట్ చెయ్యటం గుగూల్‌కు కొత్తేమి కాదు. 2008, చైనాలో నిర్వహించిన బీజింగ్ ఒలంపిక్స్‌కు సంబంధించి గుగూల్ పోస్ట్ చేసిన డూడుల్ అప్పట్టో ప్రత్యేకమైన విశిష్టతను సంతరించుకుంది. ఐదు ఒలింపిక్ mascotsతో రూపుదిద్దుకున్న ఈ డుడూల్ బీజింగ్ ఒలంపిక్ క్రీడలకు మరింత వన్నె తెచ్చింది. క్రీడలు ముగిసేంత వరకు రోజుకో ఒలంపిక్ డూడుల్‌ను పోస్ట్ చేస్తూ గుగూల్, ఒలింపక్స్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot