గుగూల్ డూడుల్ (ఒలంపిక్స్ ప్రత్యేకం)

Posted By: Staff

గుగూల్ డూడుల్ (ఒలంపిక్స్ ప్రత్యేకం)

లండన్ 2012 ఒలంపిక్స్‌లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం గుగూల్ , ‘ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ మెన్స్ రింగ్స్ డూడుల్’ను తన హోమ్ పైజ్ పై పోస్ట్ చేసింది. జిమ్నాస్టర్ రెండు రింగులను ఆధారంగా చేసుకుని వివిధ భంగిమల్లో చేస్తున్న సాహసాలను ఈ డూడుల్ ప్రతిబింభిస్తుంది. ఒలంపిక్స్‌లో భాగంగా సోమవారం గుగూల్ సాము విద్య (ఫెన్సింగ్ క్రీడ)తో కూడిన ఒలంపిక్ డూడుల్‌ను తన హోమ్ పేజ్ పై పోస్ట్ చేసింది. సాము విద్యలో ఆరితేరిన ఇద్దరు క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న తీరును ఈ డూడుల్‌లో ప్రతిష్టించింది.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot