గుగూల్ ఒలంపిక్ మండే డూడుల్ .. ‘జావెలిన్ త్రో’

Posted By: Staff

గుగూల్ ఒలంపిక్ మండే డూడుల్ .. ‘జావెలిన్ త్రో’

2012 లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా సోమవారం సెర్చ్ ఇంజన్ గూగుల్ ‘జావెలిన్ త్రో ’కు మొట్టమొదటి సారిగా ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత డూడుల్‌ను హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. జావెలిన్ త్రో అథ్లెటిక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా విసిరే అంశాలలో ఒకటి. ఈ పోటీలో భాగంగా పురుషులు 2.7 మీటర్లు పొడవు కలిగి 800గ్రాములు బరువున్న ఈటెను (జావెలిన్)ను విసురుతారు. మహిళలు 2.2 మీటర్లు పొడవు కలిగి 600గ్రాముల బరువున్న ఈటెను విసురుతారు. గుగూల్ ఒలంపిక్ స్పెషల్ డూడుల్స్‌లో భాగంగా ఆదివారం స్విమ్మింగ్ ప్రాధాన్యతను కల్పిస్తూ స్విమ్మింగ్ డూడుల్‌ను పోస్ట్ గుగూల్ చేసింది.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot