నేటి గుగూల్ హోమ్ పేజ్ చూశారా..?

Posted By: Prashanth

నేటి గుగూల్ హోమ్ పేజ్ చూశారా..?

 

నెట్ యూజర్లు... ఈ రోజు గుగూల్ హోమ్‌పేజ్‌ను చూశారా..?, సెర్చ్ ఇంజన్ పై కనిపిస్తున్నఆ ఆరు అందమైన జ్యువెల్ గుడ్లు చూడ ముచ్చటైన ఆకృతులను కలిగి ఉన్నాయి కదూ! ఇంతకీ వాటి విశిష్టత ఏంటి..?, గుగూల్ ఎందుకు వాటిని నేటి డూడూల్‌గా ఎంచుకుంది..?

ప్రఖ్యాత రష్యన్ స్వర్ణకారుడు పీటర్ కార్ల్ ఫాబెర్జె 166వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సృజనకు అద్దంపట్టే ‘ఫాబెర్జె గుడ్ల’ను గుగూల్, నేటి హోమ్‌పేజ్ పై ప్రదర్శనకు ఉంచింది. పీటర్ 1846, మే 30వ తేదీన సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జన్మించారు. తండ్రి కారణంగా స్వర్ణకార వృత్తి పట్ట ఆకర్షితుడైన పీటీర్... వ్యాపారంలో భాగంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ , జర్మనీ దేశాల్లో పర్యటించి ఆభరణాల తయారీకి కావల్సిన పూర్తిస్ధాయి నైపుణ్యాలను అలవరుచుకున్నాడు.

1882, మాస్కోలో నిర్వహించిన పాన్-రష్యన్ ఎగ్జిబిషన్ పీటర్ ఉత్తమ ప్రతిభకుగాను గోల్డ్ మెడల్‌ను బహుకరింరచింది. 1885లో ఫాబెర్జె రోమానోవ్ రాజవంశ ఆస్థాన స్వర్ణకారుడిగా నియమితులయ్యారు. రష్యన్ రాజ కుటుంబీకుల ఈస్లర్ పర్వదినాన్ని పురస్కరించుకుని బహుమతులను ప్రధానం చేసే సాంప్రదాయం తరతరాలుగా వస్తుండంతో ఈ వేడుకను పరుస్కరించుకుని ఏటా ‘ఈస్టర్ ఎగ్’లను ఫాబెర్జె రూపొందించే వారు.

రష్యన్ రాజ కుటుంబానికి 37 సంవత్సరాల పాటు సేవలందించిన ఫాబెర్జె 54 ఈస్టర్ గుడ్లను డిజైన్ చేశారు. 1917 తరువాత తలెత్తిన పరిణామాల నేపధ్యంలో ఫాబెర్జె స్విట్జర్లాండ్ ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 1920, సెప్టంబర్ 24న యూవత్ ప్రపంచ గర్వించదగ్గ ఆ స్వర్ణకారుడు తుదిశ్వాస విడిచాడు. ఫాబెర్జె డిజైన్ చేసిన వాటిలో 9 గుడ్లను భారత్‌లో నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot