Google Duoతో వీడియో కాల్స్ మరింత సులువు
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన Duo వీడియో కాలింగ్ యాప్ ఫీచర్‌ను, ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని కాంటాక్ట్ యాప్‌తో పాటు మెసేజింగ్ యాప్‌కు ఇంటిగ్రేట్ చేస్తోంది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన Duo వీడియో కాలింగ్ యాప్ ఫీచర్‌ను, ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని కాంటాక్ట్ యాప్‌తో పాటు మెసేజింగ్ యాప్‌కు ఇంటిగ్రేట్ చేస్తోంది. దీంతో వీడియో కాలింగ్‌ను మరింత సులభతరంగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. వీడియో కాలింగ్ ఆప్షన్‌తో కూడిన ఈ లేటస్ట్ ఫీచర్‌ను ముందుగా మొదటి జనరేషన్ Pixel స్మార్ట్‌ఫోన్‌లతో పాటు Android One అలానే Nexus డివైస్‌ల్లోకి గూగుల్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ తాజా అప్‌డేట్‌తో గూగుల్ డ్యుయో వీడియో కాల్ ఆప్షన్, ఫోన్‌లోని కాల్ హిస్టరీతో పాటు కాంటాక్ట్స్ అప్లికేషన్‌లోని ప్రతి కాంటాక్ట్ పక్కన దర్శనమిస్తుంది. మెసేజింగ్ యాప్‌లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటోంది. ప్రస్తుతానికి గూగుల్ సొంత ఫోన్‌లలో మాత్రమే వర్క్ అయ్యే ఈ ఫీచర్ త్వరలోనే మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు వర్తించే అవకాశం ఉంది.
గూగుల్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి తీసుకువస్తోన్న ఈ సౌకర్యాన్ని యాపిల్ కంపెనీ ఇప్పటికే తన FaceTime app ద్వారా కల్పిస్తోంది. యాపిల్ ఫేస్‌టైమ్ అప్లికేషన్ ద్వారా ఐఫోన్ యూజర్లు నేరుగా కాంటాక్ట్స్ యాప్ నుంచి వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.
ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ తన మెసేజింగ్ అప్లికేషన్ Allo కోసం ఓ అప్డేట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అప్‌డేట్ తరువాత గూగుల్ యూజర్లు ఈ మెసేజింగ్ యాప్ చాట్ విండో నుంచే Duo వీడియో కాల్స్ చేసుకోగలుగుతున్నారు.
గూగల్ డ్యుయో ద్వారా సులభతరమైన వీడియో కాలింగ్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందించాలన్నది గూగుల్ లక్ష్యం. ఈ యాప్‌ను ఉపయోగించుకునేందుకు ఎటువంటి ప్రత్యేకమైన యూజర్ నేమ్స్ ఇంకా పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు. యూజర్ తన మొబైల్ నెంబర్ ధ్వారా డ్యుయో వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.
ఇంటర్నెట్ కనెక్టువిటి బలహీనంగా ఉన్నప్పటికి ఈ యాప్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. డ్యుయో వీడియో కాలింగ్ యాప్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆఫర్ చేస్తుంది. 'నాక్ నాక్' అనే సరికొత్త ఫీచర్ ఈ యాప్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కాల్ లిఫ్ట్ చేయక ముందే కాల్ చేసిన వారి లైవ్ వీడియోను మనం చూడొచ్చు.
ఫీచర్ల పరంగా Google Duo యాప్‌ను వాట్సాప్ ఇంకా హైక్ మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లతో కంపేర్‌చేసి చూసినట్లయితే వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో యాప్‌ను హ్యాండిల్ చేయటం సామాన్యులకు అంత సులభంగా అనిపించదు.
గూగుల్ డ్యుయో యాప్‌ను కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే డిజైన్ చేయటం జరిగింది. ఇదే సమయంలో వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్స్ ద్వారా వీడియో కాల్స్‌తో పాటు వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసెజ్‌లు పంపుకోవచ్చు, ఫోటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఈ రెండు యాప్‌లలో కొలువుతీరి ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications








