భూమిని చూసేందుకు 'గూగుల్ ఎర్త్ కొత్త వర్సన్ 6.2'

Posted By: Prashanth

భూమిని చూసేందుకు 'గూగుల్ ఎర్త్ కొత్త వర్సన్ 6.2'

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తులలో 'గూగుల్ ఎర్త్' ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఊహ స్వాధీనం అందించే భాగంలో గూగుల్ దీనిని ప్రవేశపెట్టింది. ఐతే ఇప్పుడు 'గూగుల్ ఎర్త్' దీనికి సంబంధించిన కొత్త వర్సన్‌ని అభివృద్ది చేసింది. గూగుల్ అభివృద్ది చేసిన ఈ గూగుల్ ఎర్త్ 6.2 వర్సన్ వినియోగదారులకు ఖచ్చితమైన అభిప్రాయాలు పొందుటకు సహాయం చేయడమే కాకుండా, తాజా శోధన ఇంటర్‌ఫేసెస్ అందిస్తుంది. గూగుల్ ఎర్త్ 6.2 వర్సన్ వినియోగదారులకు అందించే అధ్బుతమైన ప్రత్యేకతలు క్లుప్తంగా...

మెరుగైన శోధనలు: గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఆటో కంప్లీట్ ఫీచర్‌ని గూగుల్ ఎర్త్ 6.2 లో చేర్చారు. సెర్చ్ లేయర్ ఫంక్షన్ ద్వారా సెర్చ్ చేసిన మొదటి పది సంబంధిత శోధన ఫలితాలు ఇప్పడు ప్రదర్శించబడుతాయి. వీటితో పాటు గూగుల్ నుండి వినియోగదారుల అన్వేషణ ఆలోచించడంతో పాటు...గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉపయోగించి ఫలితాలు ప్రదర్శన  బైకింగ్, వాకింగ్ మరియు రవాణా ఆదేశాలను చేర్చుకున్నారు.

ఒకే ఒక్క క్లిక్‌తో గూగుల్ ప్లస్ షేర్: యూజర్లు గూగుల్ ఎర్త్ 6.2 ఉపయోగించి ఒకే ఒక్క క్లిక్‌తో చిత్రాలను గూగుల్ ప్లస్‌కి పంచుకోవచ్చు. పర్వతాలతో సహా అన్ని చిత్రాలు, నగరాలు, ఎడారులు, సముద్రాలు మొదలగునవి 3డి ఫార్మాట్‌లో షేర్ చేసుకోవచ్చు. స్థలాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని సమర్థవంతంగా గూగుల్ ప్లస్‌కి గూగుల్ ఎర్త్ 6.2 ఉపయోగించి షేర్ చేయవచ్చు.

భూమి యొక్క ఉపగ్రహ దృశ్యం: ఉపగ్రహ 3డి కోణంతో భూమిపై ఉన్న ప్రకృతిని మెరుగైన చిత్రాలుగా వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా యూజర్స్ ఖచ్చితంగా మంచి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇందులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నేరుగా వాటిని సవరించే అవకాశం లేకుండా భౌగోళిక ప్రకృతి దృశ్యాలను వినియోగదారులకు ప్రదర్శిస్తుంది.  గూగుల్ ఎర్త్ 6.2లో ఉన్న ప్రత్యేకతలు గ్యారంటీగా యూజర్స్‌కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్‌ని అందించనున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot