గూగుల్ ప్లస్‌ రాకతో గూగుల్‌కి డబ్బులే డబ్బులు

Posted By: Staff

Google+

కాలిపోర్నియా: సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యవహారిస్తుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు ఏంటని అనుకుంటున్నారా.. అదేనండీ గూగుల్ త్వరలో ప్రవేశపెట్టనున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్ వల్ల డబుల్ బోనాంజా ఆఫర్ పోందుతుంది. గూగుల్ కంపెనీ గూగుల్ ప్లస్ బీటాని విడుదల చేసిన తర్వాత ఎక్కువ మంది యూజర్స్ వారియొక్క సమయాన్నిఎక్కువగా గూగుల్ మీదనే గడుపుతున్నారంట. దాంతో గూగుల్ డిస్ ప్లే యాడ్ మార్కెట్ రెవిన్యూ అనూహ్యాంగా పెరిగిందని సమాచారం. మరో ప్రక్క యూజర్స్ గూగుల్ ప్లస్‌లో ఉపయోగాలను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ని వదిలేసి గూగుల్ ప్లస్‌లోకి రావడం జరుగుతుందంట.

గతంలో మార్కెట్ లీడర్, ప్రపంచంలో పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ ఎక్కువ మంది కస్టమర్స్ గూగుల్‌ని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియక సతమతమయ్యేది. ఎప్పుడైతే ఫేస్‌బుక్ విడుదలైందో ఆ తర్వాత వారికి తెలిసింది ఆ స్ట్రాటజీ ఏంటనేది. ఆ తర్వాత కాలంలో ఎడ్వర్టైజర్స్ అందరూ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో వారి యొక్క యాడ్స్‌ని ప్లేస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకు కారణం కస్టమర్స్ ఎక్కువ సమయాన్ని వారియొక్క సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌కి కేటాయించడమే.

అంతేకాకుండా ఎప్పుడైతే గూగుల్ ప్లస్ వచ్చిందో కస్టమర్స్ ఎక్కువ మంది వారి సమయాన్ని గూగుల్‌పై కేంద్రీకరిస్తున్నారని తెలిసింది. అదెలాగంటే ర్యాంక్స్‌ని ప్రకటించేటటువంటి అలెక్సా అనే వెబ్ సైట్ డేటాని విడుదల చేసింది. గత జూన్ నెల వరకు గూగుల్‌ని 13.8 నిమిషాల సమయం కేటాయిస్తే అదే జూన్ తర్వాత ఆ సంఖ్య 14.5 నిమిషాలకు చేరిందని తెలియజేశారు. ఇక గూగుల్ ప్లస్ విడుదల చేసిన రెండు వారాలకే అందులో 20మిలియన్ యూజర్స్ సభ్యత్వం తీసుకోని రికార్డ్‌ని నమోదు చేసింది.

ప్రస్తుతానికి గూగుల్ ప్లస్ మాత్రం నెంబర్ వన్ సోషల్ నెట్ వర్కింగ్‌గా చలామనీ అవుతున్న ఫేస్‌బుక్‌కి మాత్రం గట్టి పోటీనిస్తుందని యూజర్స్ భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో గూగుల్ ప్లస్ యూజర్స్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఇది మాత్రమే కాకుండా యూజర్స్ ఐకానిక్ స్మార్ట్ పోన్ ఐపోన్‌కి సంబంధించి గూగుల్ ప్లస్ అప్లికేషన్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot