రోజుకు గంట మాత్రమే పని.. వేతనం మాత్రం రూ.1.2 కోట్లు..!
హార్డ్ వర్క్ బదులుగా స్మార్ట్ వర్క్ చేయండి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అదే సూత్రాన్ని ఓ టెకీ ఫాలో అవుతున్నాడు. రోజుకు కేవలం గంట మాత్రమే పనిచేస్తున్నాడు. కానీ ఏడాదికి రూ.1.2 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఈ విషయంలో ఆ ఉద్యోగి స్పందించాడు. తాను ప్రస్తుతం గంట మాత్రమే పనిచేస్తున్నానని, ఎక్కువ గంటలు పనిచేయాలనుకుంటే ఏదైనా స్టార్టప్‌లో చేరే వాడినని చెప్పాడు.
ఈ ఉద్యోగి పేరు డెవాన్‌గా (మారుపేరు) తెలుస్తోంది. మరియు ఇటీవలే సైన్ ఇన్ బోనస్ కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సంవత్సరలో వచ్చే బోనస్ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ టూల్స్, ఉత్పత్తులకు సంబంధించి కోడింగ్ రాయడం ఈ ఉద్యోగి పనిగా తెలుస్తోంది.

గూగుల్‌లో సంస్థలో తొలుత డెవాన్ తొలుత ఇంటర్న్‌గా పనిచేశాడు. అయితే ఒకవేళ ఉద్యోగం సంపాదించినా.. ఎక్కువ గంటలు పనిచేయలేనని తెలుసని డెవాన్ చెప్పాడు. ఇంటర్న్ సమయంలో ముందుగానే కోడ్ రాసేవాడనని, ఆ సమయంలో వారం రోజులపాటు పర్యటనకు కూడా వెళ్లినట్లు చెప్పాడు.
తాను ఎక్కువ గంటలు పనిచేయాలనుకుంటూ స్టార్టప్‌లో చేరేవాడినని డెవాన్ చెప్పాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో భాగంగా చాలా మంది గూగుల్‌ను ఎంచుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అడ్మిషన్‌తో సంబందం లేకుండా వేతనం పొందే వేలాది మంది ఉద్యోగుల్లో తాను ఒకడినని డెవాన్ తెలిపాడు.
డెవాన్ రోజులో ఉదయం ఒక గంటపాటు గూగుల్ కోసం పనిచేస్తాడు. మరియు మిగిలిన సమయం అంతా తన సొంత స్టార్టప్ కోసం డెవాన్ పనిచేస్తున్నాడు. తన చాలా మంది స్నేహితులు రాత్రులు కూడా పనిచేయడాన్ని చూశానని, తాను అలాంటి విధానాన్ని సమర్థించలేనని డెవాన్ తెలిపాడు.
అయితే ఈ ఉద్యోగి పని, వేతనం సహా ఇతర వివరాల కోసం గూగుల్‌ను సంప్రదించామని, తమ అభ్యర్థనపై గూగుల్ వెంటనే స్పందించలేదని ఆ వార్త సంస్థ వెల్లడించింది. అయితే చాలా మంది ఉద్యోగులు ఇటువంటి పని విధానాన్ని కోరుకుంటున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌గా ఉండాలని అనేక మంది కోరుకుంటున్నారు.
ఈ సంవత్సరం జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, అధిక వేతనాలు ఇచ్చే సంస్థలో గూగుల్ ఒకటిగా గుర్తింపు పొందింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2022 సంవత్సరంలో అధికంగా వేతనాలు చెల్లించే మొదటి మూడు సంస్థల జాబితాలో ఉంది.
ఇటీవల కాలంలో అనేక టెక్ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. అనేక ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది మందిని తొలగించాయి. దీంతో ఒక్కసారిగా టెక్ ఉద్యోగుల్లో భయాందోళన ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం దీనిపై అనేక వార్తలు బయటకువచ్చాయి. తమను ఎలాంటి పరిస్థితుల్లో తొలగించారో చెబుతూ చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








