గూగుల్ కార్యాలయంలో దొంగతనం, టెక్నాలజీకే దొరకని వైనం !

మనకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన ముందుంచే గూగుల్ కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది.

By Hazarath
|

మనకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన ముందుంచే గూగుల్ కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. తన ఆఫీసులోనే మాయం అవుతున్న జీబైక్స్ జాడను కనిపెట్టలేక తలపట్టుకుంటోంది. ఇది మీకు విచిత్రంగా అనిపించినప్పటికీ నమ్మలేని నిజం..ఇంతకీ జీబైక్స్ అంటే ఏంటో తెలుసా..గూగుల్ సైకిళ్లు...అవి కనపడటం లేదని గూగుల్ చెబుతోంది. వెతికే పనిలో బిజిగా ఉంది. పూర్తి వివరాల్లోకెళితే..

నోకియా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు !నోకియా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు !

 1,100 ఫ్రీ టూవీలర్ బైస్కిల్స్

1,100 ఫ్రీ టూవీలర్ బైస్కిల్స్

అమెరికా కాలిఫోర్నియా మౌంటైన్ వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఎంప్లాయిస్ తిరగడానికి 1,100 ఫ్రీ టూవీలర్ బైస్కిల్స్ అందుబాటులో ఉంచింన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

వారం రోజుల్లోనే 250 సైకిల్స్..

వారం రోజుల్లోనే 250 సైకిల్స్..

ఎల్లో ఫ్రేమ్స్, గ్రీన్, బ్లూకలర్ వీల్స్ తో అద్భుతంగా తయారు చేసిన ఈ జీబైక్స్ ఈ మధ్య మాయం అవుతున్నాయట. వారం రోజుల్లోనే 250 సైకిల్స్ కనిపించకుండా పోయాయని గూగుల్ చెబుతోంది. వీటిని వెతికే పనిని గూగుల్ సిబ్బందికి అప్పజెప్పింది.

గూగుల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ సర్వీస్

గూగుల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ సర్వీస్

అయితే గూగుల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ సర్వీస్ ఎలా ఉంది అనటానికి ఇదో ఉదాహరణ అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

బయట నుంచి వచ్చిన దొంగలు కాదని..

బయట నుంచి వచ్చిన దొంగలు కాదని..

అయితే ఇవి బయట నుంచి వచ్చిన దొంగలు కాదని.. ఎంప్లాయీస్ లోని కొందరు వాటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తుండటం వల్లే అవి ఎక్కడంటే అక్కడ వదిలేస్తున్నారని చెబుతున్నారు.

ఆచూకీ మాత్రం ఎవరు చెప్పాలి అనేది..

ఆచూకీ మాత్రం ఎవరు చెప్పాలి అనేది..

ఇన్వెస్టిగేషన్, ఇతర పరిశోధనలకు గూగుల్ పై ఆధారపడుతుంటే.. గూగుల్ ఆఫీస్ లోని మిస్ అయిన సైకిళ్ల ఆచూకీ మాత్రం ఎవరు చెప్పాలి అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఆపిల్‌, ఫేస్‌బుక్‌, వాల్‌స్ట్రీట్‌ లాంటి 16 దిగ్గజాలు..

ఆపిల్‌, ఫేస్‌బుక్‌, వాల్‌స్ట్రీట్‌ లాంటి 16 దిగ్గజాలు..

గూగుల్ ప్రారంభించిన వెంటనే ఆపిల్‌, ఫేస్‌బుక్‌, వాల్‌స్ట్రీట్‌ లాంటి 16 దిగ్గజాలు ఈ ప్రొగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

30 మంది గూగుల్‌ కాంట్రాక్టర్లు, 5 వ్యాన్లు..

30 మంది గూగుల్‌ కాంట్రాక్టర్లు, 5 వ్యాన్లు..

కాగా సగటున 12 ట్రిపులు, రోజుకు ఆరు మైళ్లు ఈ జీబైక్స్‌ ప్రయాణించగలవు.దొంగలించబడ్డ ఈ జీబైక్స్‌ను 30 మంది గూగుల్‌ కాంట్రాక్టర్లు, 5 వ్యాన్లు వెతకడం ప్రారంభించారని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Google employees lose nearly 250 Gbikes a week: Report More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X