జీవితమంటే వీళ్లదేనండోయ్!!

Posted By:

గూగుల్‌లో ఉద్యోగం సంపాదించటమనేది ఓ వరం.. ఓ అద్భుతం, ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నిమాటలైనా చాలవు. ఉద్యోగుల ఎంపికలో భాగంగా నైపుణ్యం కలవారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించే గూగుల్ వారి బాగోగుల విషయంలోనూ ఏ మాత్రం లోటు చేయటం లేదు. సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఏంచేసినా అద్భుతమే. తమ కార్యాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ కల్పిస్తున్న సౌకర్యాలు సంస్థ గొప్పతనాన్ని చాటుతున్నాయి. గూగుల్ తమకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల పలువురు ఉద్యోగులు తమదైన రీతిలో స్పందించారు.

(చదవండి: నమ్మండి.. ఇవి ఆ ఫోటోలే!!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు అక్కడి పనిచేసే ఉద్యోగులకు ఆధునిక యుగంలో ఉన్న అనుభూతిని చేరువ చేస్తాయి.

నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

గూగుల్ కార్యాలయల్లో నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు సహా ఉద్యోగులు సందేహాలను తీర్చటంలో పూర్తిస్థాయిలో స్పందిస్తారు.

పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటును కల్పిస్తోంది.

అనువైన పని వాతావరణం

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సు పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని వారికి అనువైన పని వాతావరణాన్ని గూగల్ ఏర్పాటు చేస్తుంది.

ప్రతి శుక్రవారం ఉద్యోగులకు బీర్ ఇంకా మద్యం పంపిణీ

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

ప్రతి శుక్రవారం ఉద్యోగులకు బీర్ ఇంకా మద్యాన్ని ఉచితంగా గూగల్ పంపిణీ చేస్తంది.

ప్రసూతి సెలవు నిమిత్తం

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

ప్రసూతి సెలవు నిమిత్తం తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు కేటాయింపుతో పాటు బోనస్‌లను గూగుల్ కల్పిస్తోంది.

సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు.

పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యి డాలర్లు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యి డాలర్లు (దాదాపు రూ.55వేలు) అందజేస్తారు. ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది.

ఫిట్నెస్ తరగతులు

జీవితమంటే వీళ్లదేనండోయ్!!

గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Employees Luxury life. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot