గూగుల్ బెదిరింపులు..దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

Written By:

గూగుల్‍కి రష్యా దిమ్మతిరిగే షాకిచ్చింది. మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించాలనే ఆతృతకి రష్యా అడ్డుకుట్ట వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం గూగుల్ ఆపరేటింగ్ సిస్టం పేరుతో, ఇన్‌స్టాల్ పేరుతో రష్యా మొబైల్ వినియోగదారులను బెదిరిస్తోందని రష్యా కంపెనీ యాండెక్స్ యాంటీ ట్రస్ట్‌కి ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు స్లైడర్స్‌లో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

రెండు నెలల్లో 6.75 మిలియన్ డాలర్ల( రూ.45 కోట్లను) జరిమానాను రష్యాకు చెల్లించాలని గూగుల్‌కు ఆదేశాలు జారీఅయ్యాయి.రష్యా యాంటీ ట్రస్ట్ అథారిటీ ఈ జరిమానా విధించింది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

మార్కెట్లో గుత్తాధిపత్యం కొనసాగించడానికి, తమ ఆండ్రాయిడ్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా మొబైల్ తయారీదారులను గూగుల్ బెదిరిస్తుందన్న ఆరోపణలు నిజమని తేలిన నేపథ్యంలో యాంటీ ట్రస్ట్ అథారిటీ ఈ ఆదేశాలు జారీచేసింది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

రష్యాలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ యాండెక్స్ ఫిర్యాదు మేరకు ఫెడరల్ యాంటీమోనోపలీ సర్వీసు(ఎఫ్ఏఎస్) గతేడాది సెప్టెంబర్‌లో గూగుల్ చట్టాలను అతిక్రమిస్తుందనే కేసును విచారించింది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

యాండెక్స్ తన ఫిర్యాదులో గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లను అడ్డుకోవాలని అథారిటీలను కోరింది. ఈ కేసును విచారించిన ఎఫ్ఏఎస్ రెండు నెలల్లో గూగుల్ ఈ జరిమానాను చెల్లించాలని పేర్కొంది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

వినియోగదారులపై పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే రష్యాలో మొబైల్ సాప్ట్‌వేర్ మార్కెట్‌లో డెవలప్‌మెంట్ కాంపిటీషన్‌ను అనుమతిస్తామని రష్యా రెగ్యులేటింగ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ డిపార్ట్‌మెంట్ అధినేత యెలెనా జెయేవా తెలిపారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

ఎఫ్ఏఎస్ నుంచి నోటీసులు అందుకున్నామని, తర్వాతి అడుగు వేయబోయే ముందు ఈ నోటీసును పూర్తిగా విశ్లేషిస్తామని గూగుల్ పేర్కొంది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

మరోవైపు దక్షిణ కొరియాలో కూడా యాంటీ ట్రస్ట్ చట్టాలను అతిక్రమించిందన్న ఆరోపణలపై గూగుల్‌పై విచారణ కొనసాగుతోందని ఆ దేశం పేర్కొంది. ఒకవేళ అది నిజమని తేలితే దక్షిణ కొరియాలో కూడా గూగుల్ జరిమానాను భరించాల్సి ఉంటుంది.

గూగుల్ బెదిరింపులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రష్యా

మరి గూగుల్ ఇలా తన ఆధిపత్యం కోసం ముందు ముందు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తుందో..ఇంకెన్ని దేశాల చేతిలో వార్నింగ్ కు బలవుతోందో చూడాలి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Fined $6.8 Million by Russian Antitrust Regulator Over Android
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot