‘గూగుల్‌’కు కోట్లలో ఫైన్!

By Super
|
Google Fined in Australia Defamation Case


సిడ్నీ: ఇంటర్‌నెట్ సెర్చింజన్ ‘గూగుల్ ’ నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో నష్ట పరిహారాన్ని పొందాడు. గూగుల్‌పై పరువు నష్టం కేసు వేసిన మిలోరాడ్ టర్కుల్జా (62) అనే ఆ వ్యక్తి ఏకంగా రూ. 1.14 కోట్లు (2,08000 డాలర్లు) పరిహారంగా తీసుకున్నాడు. తనకు నేరగాళ్ల ముఠాతో సంబంధాలున్నట్లు సమాచారాన్ని ఉంచిన గూగుల్ తనకు పరువునష్టం కలిగించిందంటూ అతడు కోర్టును ఆశ్రయించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్‌గా పనిచేసే తనను మెల్‌బోర్న్‌లోని ఓ ప్రముఖ నేరస్తుడిగా చిత్రిస్తూ గూగుల్‌లో సమాచారం ఉంచారని, దీనివల్ల తనకు తీవ్ర పరువునష్టం జరిగి, వ్యాపారం కూడా దెబ్బతిందని టర్కుల్జా వాదించారు.

2004లో జరిగిన ఓ నేర సంఘటనపై ఇప్పటికీ ఏమీ తేలలేదని, అయినా దానితో తనకు ముడిపెడుతూ నేరస్తుడిగా చిత్రించారని తెలిపాడు. ఇదే విషయంపై యాహూ సెర్చింజన్ నుంచి కూడా తాను ఇదివరకే రూ. 1.23 కోట్ల పరిహారాన్ని పొందినట్లు చెప్పాడు. అయితే, ఆ సమాచారాన్ని వేరే వ్యక్తులు ఉంచారన్న గూగుల్ వాదనను విక్టోరియా సుప్రీంకోర్టు తిరస్కరించింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న సమాచారాన్ని తొలగించాల్సిందిగా నోటీసులు పంపినా, చర్యలు తీసుకోవడంలో గూగుల్ విఫలమైనందున పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X