భారత పల్లెలోకి గూగుల్ బెలూన్ ఇంటర్నెట్!

Posted By:

భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలు త్వరలో తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సదుపాయాలను పొందనున్నాయి. ఇందుకుగాను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కసరత్తులు చేస్తోంది. ఇంటర్నెట్ దిగ్గజం గూగల్ తన బెలూన్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ ను దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షించనున్నట్లు గూగుల్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

భారత పల్లెలోకి గూగుల్ బెలూన్ ఇంటర్నెట్!

వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులు ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా అందుతున్నాయి. ఈ వ్యవహారం ఖరీదైనదిగా ఉండటంతో అనేక దేశాల్లో ఇంటర్నెట్ అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి అందుబాటులో ఉండగా.. 480 కోట్ల మందకి దూరంగానే ఉంది. ఈ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. 18 నెలల క్రితం గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది. ఈ వివరాలను గూగుల్ శనివారం వెల్లడించింది. భూమికి 12 మైళ్ల ఎత్తులోకి కొన్ని హీలియం బెలూన్లను పంపించింది. వీటిని నుంచి దాదాపు ఇప్పటికే 50 కుటుంబాలు తమ ఇళ్లలోని కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot