గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్.. గూగుల్‌పే యాప్ ద్వారా లోన్‌లు, స్థానిక భాషల్లోకి జెమిని లైవ్ సహా..!
టెక్ దిగ్గజం గూగుల్ (Google India) ఇవాళ గూగుల్ ఫర్ ఇండియా (Google for india 2024) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో యాప్‌లు, సర్వీసులపై కీలక ప్రకటనలు చేసింది. గూగుల్ లైవ్, AI సెర్చ్ ఓవర్‌వ్యూను స్థానిక భాషల్లోకి కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. గూగుల్‌పే యాప్ ద్వారా వ్యక్తిగత, గోల్డ్ లోన్‌లను తీసుకొనేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు స్కామ్‌లపై యూజర్లను అప్రమత్తం చేసేందుకు ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.
గూగుల్ సెర్చ్‌లో మెరుగైన అనుభూతి కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్ ద్వారా వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. మరియు గూగుల్ మ్యాప్స్‌ను (Google Maps) కూడా అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. ఫలితంగా వరదలు, మంచు కురుస్తున్న సమయాల్లో ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది.

దీంతోపాటు రుణాలపై గూగుల్ కీలక ప్రకటన చేసింది. గూగుల్ పే (Google Pay) ద్వారా ఇకపై రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మరియు రూ.50 లక్షల వరకు గోల్డ్‌లోన్ తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.
DigiKavach ద్వారా 2023 సంవత్సరంలో నేరాలపై 41 మిలియన్లకు పైగా వార్నింగ్ మెసేజ్‌లను పంపినట్లు తెలిపింది. దీంతోపాటు సుమారు రూ.13,000 కోట్ల విలువైన స్కామ్‌ల నుంచి యూజర్లను రక్షించినట్లు గూగుల్ పేర్కొంది. దీంతోపాటు గూగుల్ మ్యాప్స్‌లో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న 170 మిలియన్‌ల రివ్యూలను ఆటోమేటిక్‌గా గుర్తించి, తొలగించినట్లు పేర్కొంది.
Whether it’s brainstorming or a practice session for your next job interview, have free-flowing conversations with Gemini Live, now rolling out in Hindi.
— Google India (@GoogleIndia) October 3, 2024
🎙️ @HemaBudaraju#GoogleForIndiahttps://t.co/BcOqMVmbu5 pic.twitter.com/wHwz2k85NI
హానికర్ యాప్‌ల నుంచి రక్షణ :
దీంతోపాటు త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లు Fraud Protection ఫీచర్‌ను పొందుతారని, దీని ద్వారా సున్నితమైన అనుమతులు అడిగే యాప్స్‌ను కట్టడి చేయనుంది. దీంతోపాటు హానికర యాప్‌లు ఆండ్రాయిడ్ ఫోన్‌లో లోడ్ కాకుండా నియంత్రంచవచ్చని గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో గూగుల్ వెల్లడించింది.
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని లైవ్ ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇవాళ్టి నుంచి హిందీలోనూ అందుబాటులోకి రానుంది. త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ భాషల్లోనూ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జెమిని ఏఐను 40 శాతం మంది వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగిస్తున్నట్లు టెక్ దిగ్గజం తెలిపింది.
జెమిని లైవ్ స్థానిక భాషల్లోనూ :
ప్రస్తుతం జెమిని లైవ్ వాయిస్ ఇన్‌పుట్ ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇవాళ్టి నుంచి హిందీలోనూ అందుబాటులోకి రానుంది. త్వరలో 8 స్థానిక భాషల్లోనూ పనిచేస్తుంది. దీంతోపాటు గూగుల్ AI ఓవర్‌వ్యూ.. తెలుగు, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్‌లో వివిధ హెల్త్ ఫీచర్‌లను కూడా ప్రదర్శించింది. అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పింది. డీప్ లెర్నింగ్ ద్వారా మెరుగైన రోగనిర్ధారణ సేవలను అందుతున్నట్లు తెలిపింది. దీంతోపాటు పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్షయ, క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications








