యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన జియో.. ఏకంగా 18 నెలల వరకు ఉచితం..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంగా మరింత మందికి అందుబాటులోకి వస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ తొలిసారిగా చాట్‌జీపీటీని లాంచ్ చేసి టెక్ ప్రపంచంలోనే ఏకంగా సంచలనం సృష్టించింది. అనంతరం అనేక సంస్థలు తమ AI చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఇప్పటికే చాలా సంస్థలు చాట్‌బాట్‌లో కొన్ని ఫీచర్‌లను ఉచితంగా అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించాయి.
అయితే ఇటీవల కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు టెలికాం సంస్థలతో జతకట్టి, ఆయా యూజర్లకు ప్రో మోడల్స్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ యూజర్లకు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను సంవత్సరం వరకు ఉచితంగా అందుబాటులో ఉండనుంది.

అనేక మంది ఎయిర్‌టెల్ యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రో మోడల్ ధర సుమారుగా రూ.17 వేల వరకు ఉంటుందని సంస్థ చెబుతోంది. ఉచిత వెర్షన్‌తో పోలిస్తే ప్రో వెర్షన్‌లలో అనేక అదనపు ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.
ఇటీవలే ఓపెన్‌ఏఐ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీ ప్రస్తుతం ప్లస్ వెర్షన్‌ను సంవత్సరం వరకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. కొత్త, ప్రస్తుత యూజర్లకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. నవంబర్ 4 నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది.
గుడ్‌న్యూస్ చెప్పిన జియో :
అయితే తాజాగా జియో తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జియో యూజర్లు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 18 నెలల వరకు జెమిని ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
జియో 5G ప్లాన్ కలిగిన 18 - 25 సంవత్సరాల వయస్సు కలిగిన యూజర్లు తొలుత గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోగలుగుతారు. అనంతరం మిగిలిన యూజర్లకు ఈ ఆఫర్‌ను విస్తరిస్తామని జియో తెలిపింది. ప్రో మోడల్ ధర సుమారుగా రూ.35 వేల వరకు ఉంటుందని చెబుతోంది.
MyJio యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యాప్‌లో ప్రో ప్లాన్ ఆఫ్ గూగుల్ జెమిని అనేక బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ కింది భాగాన Claim Offer పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఆఫర్‌కు మీరు అర్హులు అయితే వెంటనే యాక్టివేట్ అవుతుంది.
జెమిని ప్రో మోడల్‌లో భాగంగా నానో బనానా ఇమేజ్ జనరేషన్, వియో 3.1 వీడియో జనరేషన్‌తోపాటు నోట్‌బుక్LM, జెమిని కోడ్ అసిస్ట్ వంటి ఫీచర్‌లు ఉంటాయి. దీంతోపాటు క్లౌడ్ స్టోరేజీని కూడా పొందవచ్చు. మొత్తంగా 18 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఓపెన్ ఏఐ కూడా :
ఓపెన్ ఏఐ సంస్థ భారత్‌లో ఆగస్టు నెలలో చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలవారీ ధర రూ.399 గా ఉంది. ప్రస్తుత, కొత్త యూజర్లు సంవత్సరం వరకు ఉచితంగా వినియోగించుకొనేందుకు అవకాశం ఇస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్, చాట్‌జీపీటీ అధిపతి నిక్ టర్లీ తెలిపారు.
చాట్‌జీపీటీ గో.. ఫైల్స్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లను 10 రెట్లు అదనంగా ఉంటాయి. ఇమేజ్ జనరేషన్ కూడా అధికంగా ఉంటుంది. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే 2 రెట్లు మెమొరీని పొందవచ్చు. చాట్‌జీపీటీ గో ప్లాన్‌తోపాటు రూ.1,999 ధరకు చాట్‌జీపీటీ ప్లస్ ప్లా్న్ అందుబాటులో ఉంది. రూ.19,900 ధరకు ప్రో ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








