గూగుల్‌లో ఉద్యోగం వెతకటం మరింత సులువు

2017 గూగుల్ I/O డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ అనౌన్స్ చేసిన కొత్త సర్వీస్ Google for Jobs అఫీషియల్‌గా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ జాబ్ సెర్చ్ ఫీచర్ ద్వారా మీకు కావల్సిన ఉద్యోగాలను సులువుగా వెతుక్కునే వీలుంటుంది. డెస్క్‌టాప్ అలానే మొబైల్ వర్షన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్‌లో ఉద్యోగం వెతకటం మరింత సులువు

ఈ ఫీచర్‌ను మరింత ఉపయోగకరంగా మలిచే క్రమంలో గ్లాస్‌డోర్, లింకిడిన్, ఫేస్‌బుక్, కేరీర్‌బిల్డర్, మాన్సటర్ వంటి జూబ్ సెర్చ్ ప్రొవైడర్స్‌తో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇతర జాబ్ సెర్చింగ్ ప్లాట్ ఫామ్స్ మాదిరిగానే గూగుల్ ఫర్ జాబ్స్ సర్వీసులో కూడా ఫిల్టర్స్ అలానే టూల్స్ అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా మీకు కావల్సిన ఉద్యోగాన్ని సులువుగా సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

గూగుల్‌లో ఉద్యోగం వెతకటం మరింత సులువు

మీ లొకేషన్ ఆధారంగా అందుబాటులో ఉండే పార్ట్ టైమ్ ఇంకా ఫుల్ టైమ్ ఉద్యోగాలను ఈ సర్వీసు ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి గూగుల్ ఫర్ జాబ్స్ సర్వీసు ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

English summary
Google Gets New Job Hunting Feature. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot