పిక్సల్ ఫోన్ బాలేదని రీప్లేస్ అడిగితే గూగుల్ ఏం షాకిచ్చిందో చూడండి
టెక్నాలజీ గెయింట్ గూగుల్ ఈ మధ్య ఓ ఆశ్చర్యకరమైన బహుమతిని కొనుగోలుదారునికి అందించింది. గూగుల్ నుంచి దూసుకువచ్చిన పిక్సల్ ఫోన్లు మార్కెట్లో మంచి అమ్మకాలను రాబడుతున్న తరుణంలో అందరూ దాని మీద ఆసక్తిని చూపిస
టెక్నాలజీ గెయింట్ గూగుల్ ఈ మధ్య ఓ ఆశ్చర్యకరమైన బహుమతిని కొనుగోలుదారునికి అందించింది. గూగుల్ నుంచి దూసుకువచ్చిన పిక్సల్ ఫోన్లు మార్కెట్లో మంచి అమ్మకాలను రాబడుతున్న తరుణంలో అందరూ దాని మీద ఆసక్తిని చూపిస్తున్న సంగతి విదితమే. ఈ ఆసక్తిలో భాగంగా ఓ కొనుగోలుదారుడు తన పిక్సల్ ఫోన్ రీప్లేస్ అడిగినందుకు ఏకంగా 10 ఫోన్లను అతని ఇంటికి పంపించింది.

గూగుల్ చేసిన పొరపాటుకు ఏమి చేయలేని తరుణంలో ఈ కొనుగోలుదారుడు వాటిని తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు.. ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకెళితే..

గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్
రెడిట్ ప్రచురించిన కథనం ప్రకారం చీటో అనే వినియోగదారుడు గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే అది సరిగ్గా పనిచేయకపోవడంతో, దాని డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతూ ( రూ.56,898) గూగుల్ కంపెనీని కోరాడు.

కేవలం రూ.5500...
తాను కొనుగోలు చేసిన గూగుల్ పిక్సెల్ 3లో లోపాలున్నాయని, సరిగా పనిచేయడం లేదని, ఈ ఫోన్ తీసుకుని తన డబ్బులు తనకు తిరిగివ్వాలని గూగుల్‌ను కోరాడు. లేదంటే మరో కొత్త ఫోన్ రిప్లేస్ చేయాలని విన్నవించాడు.
అయితే దీనికి బదులుగా కేవలం రూ.5500 మాత్రమే రీఫండ్ చేసింది. దీంతో పాటుగా నగదు రీఫండ్‌కు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్ల పార్సిల్ ను పంపించింది.

వీటి ధర
వీటి ధర సుమారుగా $9,000 (సుమారు రూ. 6,17,900) ఉంటుంది. ఈ పార్సిల్ చూసిన చీటో ఖంగుతిన్నాడు. వెంటనే తేరుకున్న చీటో తన సొమ్ము మొత్తం రీఫండ్ వచ్చే వరకు... ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీకి వెనక్కి ఇచ్చేది లేదని ప్రకటించాడు.

10 ఫోన్లను కంపెనీకి రీసెండ్ చేసే ప్రయత్నంలో..
తాజా సమాచారం ప్రకారం గూగుల్ మొత్తం సొమ్మును చీటోకి రీఫండ్ చేసిందట. దీంతో చీటో మొత్తం 10 ఫోన్లను కంపెనీకి రీసెండ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కాగా ఈ ఫోన్లకు సంబంధించి తనను ఎలాంటి డబ్బులు కూడా కోరలేదని రెడిట్‌లో వెల్లడించాడు.

కొసమెరుపు ఏంటంటే..
చీటో మరో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయడంతో పదిఫోన్లు ఆర్డర్ చేసినట్టుగా భావించిందట కంపెనీ. అయితే పొరపాటుగా పంపించిన 10 ఫోన్లను రీఫండ్ చేయమని కంపెనీ అడిగే పరిస్థితిలో లేనప్పటికీ.. నిజాయితీగా తనకు వచ్చిన పార్సిల్‌ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు సిద్దపడ్డాడు చీటో.


Click it and Unblock the Notifications