గూగుల్ కొత్త ఫీచర్లు.. ఇంటర్నెట్‌ లేకుండా యూట్యూబ్, 90% డేటా ఆదా

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన 18వ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో 'గూగుల్ ఫర్ ఇండియా' పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

గూగుల్ కొత్త ఫీచర్లు.. ఇంటర్నెట్‌ లేకుండా యూట్యూబ్, 90% డేటా ఆదా

Read More : ఆ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, వాట్సాప్ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు!

ఈ ఈవెంట్‌లో భాగంగా ఇండియన్ యూజర్ల కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన ప్రొడక్ట్స్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ ఆవిష్కరించింది. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే విధంగా ఉన్న ఈ కొత్త గూగుల్ ఉత్పత్తులు 2జీ ఇంటర్నెట్ కనెక్షన్‌లలోనూ వర్క్ అవుతాయి. ప్రత్యేకించి ఇండియన్ యూజర్ల కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన 6 కీలక అప్‌డేట్స్‌ ఈ విధంగా ఉన్నాయి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ అసిస్టెంట్ ఇన్ హిందీ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ వ్యవస్థను, గూగుల్ I/O 2016లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ఆధారంగానే గూగుల్ విప్లవాత్మక మెసేజింగ్ యాప్ Allo రన్ అవుతోంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ భారత్‌లో ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ సపోర్ట్‌ను హిందీ భాషలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ వెల్లడించింది. మరిన్ని స్థానిక భాషలకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ విస్తరించే అవకాశం ఉంది.

‘Wait for Wi-Fi'

2జీ కనెక్షన్లలోనూ గూగుల్ ప్లే ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు గూగుల్ రెండు ప్రయోగాత్మక ఫీచర్లను పరిచయం చేసింది. డివైస్‌ను వై-ఫైకు కనెక్ట్ చేసినపుడు క్యాచీ ఫైల్స్ ఆధారంగా ప్లే స్టోర్‌లో మీకు అవసరమైన కంటెంట్ ముందుగా ప్రీలోడ్ కాబడుతుంది. అవసరమైన కంటెంట్‌కు ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం కారణంగా 2జీ కనెక్షన్‌లలోనూ ప్లే స్టోర్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుందని గూగుల్ చెబుతోంది. ‘Wait for Wi-Fi' పేరుతో గూగుల్ అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్‌లో భాగంగా, మీ ఫోన్ వై-ఫైకు కనెక్ట్ అయినపుడు మాత్రమే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతాయి.

వీడియోలు చూస్తే డేటా ఖర్చవ్వదు...

గూగుల్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం క్రోమ్ బేటా బ్రౌజర్‌ను మరింతగా ఆధునీకరించింది. వీడియో డేటా సేవర్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ వంటి సరికొత్త అప్‌డేట్‌లను క్రోమ్ బేటాలో గూగుల్ అదనంగా జోడించింది. వీడియో డేటా సేవర్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా యూజర్లు MP4 వీడియోలను వీక్షిస్తున్నప్పుడు 67శాతం వరకు డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫోన్ సిగ్నల్ 2జీ నెట్‌వర్క్‌కు పడిపోయిన సమయంలో, ఈ ఫీచర్ ఆటోమెటిక్ గా పేజీలను ఆప్టిమైజ్ చేసి లోడింగ్ వేగాన్ని రెండింతలు పెంచటంతో పాటు, 90 శాతం వరకు డేటాను ఆదా చేస్తుంది.

ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్

గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్ ద్వారా వీడియోలు, పాటలు ఇంకా ఫోటోలను ఆఫ్‌లైన్ యాక్సిస్‌కు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్ బేటా బ్రౌజర్‌లో ఇక పై మీరు డౌన్‌లోడ్ చేసుకునే అన్నిరకాల కంటెంట్‌ను, బ్రౌజర్‌తో కొత్తగా నిక్షిప్తం చేసిన Downloads tabలో పొందవచ్చు. కంటెంట్ డౌన్‌లోడింగ్ సమయంలో ఏమైనా నెట్ వర్క్ సమస్యలు తెలెత్తినట్లయితే కనెక్షన్ సరైన వెంటనే ఆటోమెటిక్‌గా డౌన్‌లోడింగ్ పుంజుకుంటుంది.

YouTube Go

యూట్యూబ్ గో పేరుతో సరికొత్త యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. YouTube Goలో యూజర్లు తమ ఫేవరెట్ వీడియోలతో, ట్రెండింగ్ వీడియోలను కూడా శోధించవచ్చు. ఈ సరికొత్త యాప్‌లో వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఈ యాప్ ద్వారా బోలెడంత డేటాను యూజర్లు ఆదా చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా ఆ వీడియోను మీ ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించవచ్చు.

Google Station

ఇండియన్ రైల్వేస్‌తో పాటు RailTelతో ఒప్పందం కుదర్చుకున్న గూగుల్ దేశవ్యాప్తంగా ఉన్న 400 రైల్వే స్టేషన్‌లలో ఆధునిక వసతులతో వై-ఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతానికి 50 స్టేషన్‌లలో ఈ హై-క్వాలిటీ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ సేవలను ప్రతి నెలా 3.5 కోట్ల మంది ప్రయాణికులు ఉపయోగించుకంటున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గూగుల్ దేశంలోని అదిపెద్ద కంపెనీలతో పాటు ఫైబర్ ఆప్టిక్స్ ప్రొవైడర్స్ ఇంకా నెట్‌వర్క్ ఆపరేటర్స్‌తో ఒప్పందం కుదర్చుకుని ప్రతిఒక్కరికి హైస్పీడ్ వై-ఫై నెట్‌వర్క్‌ను చేరువచేయనుంది.

Google News Lite

ప్రముఖ ఆండ్రాయిడ్ యాప్‌లలో ఒకటైన గూగుల్ న్యూస్ ఇక పై లటర్ వర్షన్‌లో లభ్యంకాబోతోంది. ఈ యాప్ డేటాను ఆదా చేయటంతో పాటు తక్కువ ఇంటర్నెట్ కనెక్షన్ లలోనూ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ద్వారా లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్‌లను తెలుసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google goes bullish on India, announces country-specific products. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot