గూగుల్ గుప్పెట్లోకి మరో కంపెనీ..?
ఇంటర్నెట్ సెర్జ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రముఖ వై-ఫై కెమెరాల తయారీ కంపెనీ డ్రాప్‌క్యామ్ (Dropcam)ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొనుగోలు చేయటం ద్వారా సరికొత్త సాంకేతికతను వినియోగదారులకు అందిచాలన్నది గూగుల్ లక్ష్యం.

ఇంట్లో వాతవరణాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకోలగే సరికొత్త వై-ఫై కెమెరా సాంకేతికతను తాము వృద్థి చేసినట్లు డ్రాప్‌క్యామ్ ఇటీవల వెల్లడించింది. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ మీరు లేని సమయంలో మీ ఇంట్లో ఎవరైనా చొరబడినట్లయితే మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఈమెయిల్ అకౌంట్‌కు తక్షణమే సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్, డ్రాప్‌క్యామ్ డీల్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. గూగుల్ ప్రణాళిక ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








