90 మిలియన్లకు చేరిన గూగుల్ ప్లస్ యూజర్ల సంఖ్య

Posted By: Super

Google+

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ రోజు రోజుకీ అభివృద్ది చెందుతూ 90 మిలియన్ యూజర్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సిఈవో లారీ పేజి తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌లో తెలిపాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లారీ పేజి గూగుల్ నాల్గవ త్రైమాసిక ఫలితాలతో పాటు ప్రెస్ రిలిజ్‌లో పేర్కోన్నారు.

గూగుల్ ప్లస్, ఆండ్రాయిడ్, జీ మెయిల్‌ల అభివృద్ది రోజు రోజుకీ పెరగడమే కాకుండా, అతి తక్కువ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాయని అన్నారు. గూగుల్ అప్లికేషన్స్ యూజర్స్‌తో ప్రెండ్లీ రిలేషన్‌షిప్‌ని కలిగి ఉండడంతో పాటు, యూజర్స్‌కి వండర్ పుల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడంలో ముందుంటాయి.

ఈ సంవత్సరం కూడా వినియోగదారులు సహాయం మరియు తిరిగి వ్యాపార పెరగడం అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. అక్టోబర్ 2011అక్టోబర్ లో 40 మిలియన్ల యూజర్స్ ఉన్న గూగుల్ ప్లస్ అనతి కాలంలో 90 మిలియన్లు యూజర్స్‌ని రాబట్టుకోవడంలో సక్సెస్ సాధించిందని అన్నారు. 2012 సంవత్సరం చివరి కల్లా సుమారు గూగుల్ ప్లస్‌లో 400 మిలియన్ల యూజర్స్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot