కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా, ఈ న్యూస్ మీ కోసమే
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గొప్ప శుభవార్తను అందించింది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గొప్ప శుభవార్తను అందించింది. తన ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ డివైస్‌లకు, రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏఏ డివైస్‌లకు కాంట్రాక్ట్ వర్తిస్తుంది..
గూగుల్ ఆదేశాల నేపథ్యంలో ఫోన్ తయారీ కంపెనీలు, ఈ ఏడాది లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు త్వరలో లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను రెండు సంవత్సరాల పాటు విడతల వారీగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లఘించే తయారీదారుల పై చర్యలను తీసుకోవటంతో పాటు వారికి ఫ్యూచర్ అప్‌డేట్‌లను నిలిపివేసే దిశగా గూగుల్ అడుగులు వేస్తున్నట్లు వెర్జ్ రిపోర్ట్ తెలిపింది. జనవరి 31, 2018 తరువాత లాంచ్ అయిన ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ఈ కాంట్రాక్ట్ అనేది వర్తిస్తుంది.

ఈ యాప్ అత్యంత ప్రమాదకరం..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో ముప్పు పొంచి ఉంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ ముసుగులో ఓ ప్రమాదకర మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి చొరబడుతోంది. ఒరిజనల్ ప్లే స్టోర్‌కు మరింత దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ ఫేక్ వెర్షన్, ఆండ్రాయిడ్ యూజర్లను సునాయాశంగా బురిడి కొట్టించేస్తోందట. ఈ ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను తొలత సిస్కో టాలోస్‌కు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. ఈ మాల్వేర్ ఫ్లెక్సిబుల్ ఇంకా ఎఫెక్టివ్ అని వీరు అభివర్ణించారు.

వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..
గూగుల్ ప్లే మార్కెట్‌ప్లేస్ తరహాలో లేబుల్ అయిన ఉన్న ఈ మాల్వేర్ అచ్చం గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ను తలపిస్తోందని రిసెర్చర్స్ చెబుతున్నారు. ఈ మాల్వేర్ యూజర్ డివైస్‌లోకి చొరబడే ముందు పర్మిషన్స్ అడుగుతుంది. యూజర్ పొరపాటున పర్మిషన్ ఇచ్చినట్లయితే డివైస్ ఆపరేటింగ్ మొత్తం మాల్వేర్ చెప్పుచేతల్లోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత .NET కోడ్ ద్వారా ప్లగిన్స్ అలానే స్క్రిప్టులను ఇంజెక్ట్ చేసి డివైస్‌లోని డేటా మొత్తాన్ని హ్యాకర్లు వారి ఆధీనంలోకి తీసేసుకుంటారు. ఈ శక్తివంతమైన మాల్వేర్ ప్రస్తుతం టెస్టింగ్ ఫేజులో ఉందని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ GPlayed ఆండ్రాయిడ్ ట్రాజన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు చెబుతున్నారు.

2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకు..
2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ట్రాజన్స్ 232 బ్యాంకుల పై విరుచుకుపడ్డాయి. వీటిలో కొన్ని భారతీయు బ్యాంకులు కూడా ఉన్నాయి. క్విక్ హీల్ పేరుతో ఈ ట్రాజన్‌ను ఐడింటిఫై చేసారు. ఇందులోని ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ2ఎఫ్8ఏ అనే మాల్వేర్ బ్యాంకింగ్ యాప్‌లలోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగిలించటంతో పాటు ఓటీపీలతో ఉన్న మెసేజ్‌లను అడ్డుకోవటం, కాంటాక్ట్‌లను దొంగిలించటం వంటివి చేసేది.


Click it and Unblock the Notifications








