గూగుల్ ఇంటర్నెట్ యూజర్లకు షాక్, మార్పును గమనించారా..?

By Hazarath
|

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇంటర్నెట్‌ యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇకపై గూగుల్ నుండి మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్‌ చేసుకోకుండా సెర్చింజన్‌లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా 'వ్యూ ఇమేజ్‌' బటన్‌ను తొలగించేసింది. కాగా ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్‌ చేసినప్పుడు పక్కన విజిట్‌, షేర్‌లతోపాటు వ్యూ ఇమేజ్‌ ఆప్షన్‌ కూడా కనిపించేది. దానిని క్లిక్‌ చేస్తే ఆ ఫోటో ఓపెన్‌ అయ్యి సేవ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్‌ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను గూగుల్‌ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్‌ లో కేవలం విజిట్‌, షేర్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.

 

ఒక్క తెలుగు అక్షరం ఐఫోన్లకు చుక్కలు చూపించిందిఒక్క తెలుగు అక్షరం ఐఫోన్లకు చుక్కలు చూపించింది

 నేటి నుంచే కొన్ని మార్పులు

నేటి నుంచే కొన్ని మార్పులు

గూగుల్‌లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశామని గూగుల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ద్వారా విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా ఆధారిత వెబ్‌‌సైట్‌కు యూజర్‌ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్‌ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది.

హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే..

హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే..

హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్‌ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. మరి ఇది నిజంగా యూజర్లను నిరాశకు గురిచేసే వార్తేనంటూ పలువురు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?
 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఒబామా సిగిరెట్ తాగటం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. కాని ఈ ఫోటోలో ఒబామా సిగిరెట్ తాగుతున్నట్లుగా ఉంది. ఆదివారం ఫ్రెండ్స్‌తో ఏమైనా తాగుతున్నప్పుడు క్లిక్ మనిపించారేమో మరి.

పుచ్చకాయ దబ్బ

పుచ్చకాయ దబ్బ

దీనిపై ఓ లుక్కేయండి... పుచ్చకాయ దబ్బ ఎర్రగా ఉంటుంది. ఈ కలర్ లో ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా..

ఇండియాలో కాలుష్యం

ఇండియాలో కాలుష్యం

ఈ చిత్రం ఇంటర్నెట్ ని ఓ ఊపు ఊపింది. దీపావళి రోజున ఇండియా అంటూ మార్మోగిపోయింది. అయితే ఇది నిజంగా దీపావళికి సంబంధించింది కాదు. ఇండియాలో కాలుష్యం ఎలా ఉందో తెలిపేదే ఈ చిత్రం

జేమ్స్ బాండ్ రాక్..

జేమ్స్ బాండ్ రాక్..

ఇది జేమ్స్ బాండ్ రాక్ అంటూ ప్రచారం చేశారు. కాని ఇది జేమ్స్ బాండ్ రాక్ కాదు. ఇది జర్మనీలోనూ అలాగూ ధాయ్ లాండ్ లోనూ ఉండే కోట.

ఏడు తలలతో నాగరాజు

ఏడు తలలతో నాగరాజు

ఏడు తలలతో నాగరాజు కనిపించారంటూ ఓ చిత్రం ఇంటర్నెట్లో మార్మోగిపోయింది. కాని నిజంగా అది ఏడుతలల నాగరాజు కాదు. సరిగ్గా చూస్తే ఈ విషయం తెలుస్తుంది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం కూల్చేస్తున్నప్పుడు..

వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం కూల్చేస్తున్నప్పుడు..

వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం కూల్చేస్తున్నప్పుడు ఈ ఫోటో దిగారంటూ నెట్ లో హల్ చల్ చేసిన ఫోటో ఇది. అయితే అది నిజం కాదు. అక్కడ విమానాన్ని ఫోటోషాప్ చేసి పెట్టారు.

డయానా

డయానా

డయానా ఇలా అసభ్యంగా వేలు చూపిస్తుందంటూ ఈ ఫోటో సంచలనం రేపింది. ఫోటోగ్రాపర్ ఢిపరెంట్ యాంగిల్ లో దీన్ని తీసారు. అది డయానా వేలు కాదు.

వేలిముద్ర

వేలిముద్ర

ఇది నిజమైన ఏలియన్ కాదు. ఇది స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మిత్ వేసిన వేలిముద్ర అంటే నమ్ముతారా..కాని నిజం.

Patricia Piccinini గీసిన చిత్రం

Patricia Piccinini గీసిన చిత్రం

ఈ ఫోటో అమ్మాయిదంటూ తెగ ప్రచారం చేశారు. కాని వాస్తవానికి ఇది ఓ పెయింటింగ్. Patricia Piccinini గీసిన చిత్రం.

కలాంజీ

కలాంజీ

కలాంజీ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇలా పడిపోయారంటూ ఈ ఫోటో తెగ హల్ చల్ చేసింది. వాస్తవానికి ఓ అవార్డుల కార్యక్రమంలో కలాంజీ కాలు జారి ఇలా పడిపోయారు. ఆ ఫోటోనే ఇది.

సౌదీ అరేబియాలోఓ ప్రాజెక్ట్ దగ్గర..

సౌదీ అరేబియాలోఓ ప్రాజెక్ట్ దగ్గర..

సిరియాలో తన తల్లిద్రండుల సమాధులు పక్కన నిదురపోతున్న బాలుడంటూ ఈ ఫోటో హల్ చల్ చేసింది. అది నిజం కాదు. వాస్తవానికి ఇది సౌదీ అరేబియాలోఓ ప్రాజెక్ట్ దగ్గర ఫోటోగ్రాపర్ తీసిన ఫోటో. అవి నిజమైన సమాధులు కాదు.

Best Mobiles in India

English summary
Google has removed the convenient ‘view image’ button from Google Images More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X