గూగుల్ కూడా యూజర్లను మోసం చేస్తోంది

By Gizbot Bureau
|

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి పనికి దాని మీద ఆధారపడుతున్నాం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు అందరూ ఆధారపడుతున్న ఏకైక సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉందంటే అది గూగుల్ మాత్రమే. పైగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే స్మార్ట్‌ఫోన్స్ పనిచేస్తుంటాయి.కాబట్టి గూగుల్‌లో మీరు చేసే ప్రతి పని అందులో రికార్డు అయి ఉంటుంది. మీరు వాడే యాప్స్ అన్నీ గూగుల్‌కు తెలిసిపోతుంటాయి. మీ పేరు, ఊరు, వయస్సు, జెండర్, అడ్రస్... ఇలా మీకు సంబంధించిన అనేక వివరాలు గూగుల్ చేతిలో ఉంటాయి. అయితే గూగుల్ కూడా అంత సురక్షితం కాదని తెలుస్తోంది.

 

హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా..

గూగుల్ సర్చ్ ఇంజిన్ గురించి ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఓ విషయాన్ని బయటపెట్టింది. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ని తప్పించుకునేందుకు హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటోందని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ బయటపెట్టింది. బ్రౌజర్ మేకర్ బ్రేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తును డేటా ప్రొటెక్షన్ కమిషన్ మేలోనే ప్రారంభించింది. అయితే యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటుందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. దీంతో గతంలో గూగుల్ ఈ డేటా స్కామ్ ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు మరో సాక్ష్యం బయటపడింది.

యూజర్ల సమ్మతి లేకుండా

యూజర్ల వెబ్ బ్రౌజింగ్ సమాచారం, లొకేషన్, ఇతర వివరాలను ఎలాంటి కంటెంట్ లేని వెబ్ పేజెస్ అంటే హిడెన్ పేజెస్‌లో పంపిస్తోంది గూగుల్. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ కళ్లుగప్పి హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా రహస్యంగా యూజర్ల ప్రైవసీ సమాచారాన్ని అడ్వర్టైజర్లకు గూగుల్ చేరవేస్తోందని తేలింది. "యూజర్ల సమ్మతి లేకుండా పర్సనలైజ్డ్ యాడ్స్" అందివ్వట్లేదని గూగుల్ స్పందించింది.

Google chrome బ్రౌజర్
 

గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడేవాళ్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య సమాచారం ఇతరుల చేతులకు చిక్కే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు అర్జెంట్ అప్‌డేట్‌ను ఇష్యూ చేసినట్లు ‘Metro' వెబ్‌సైట్ వెల్లడించింది. బ్రౌజర్‌లోని కంటెక్ట్స్‌లో గల ఆర్బిట్రరీ కోడ్‌ను హ్యాకర్స్ చేజిక్కించుకున్నారని, క్రోమ్ వినియోగదారుల సీక్రెట్ డేటాను చూడటమే కాకుండా, దాన్ని ఎడిట్ లేదా డిలీట్ చేయగలరని పేర్కొంది. ముఖ్యంగా బ్రౌజర్‌లో నిక్షిప్తమయ్యే బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకుని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయి. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఈ సమస్యను గుర్తించింది.

హ్యాకర్లు చిక్కకూడదంటే

హ్యాకర్లు ప్రస్తుత వినియోగదారుల సమాచారాన్ని సేకరించి.. అవే వివరాలతో కొత్త అకౌంట్‌ను సృష్టించుకోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ సమస్యను పరిషర్కించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే Macలో ఈ సమస్యను పరిష్కరించింది. రానున్న వారాల్లో లినక్స్, విండోస్‌లలో కూడా ఈ సమస్యను పరిష్కరించనుంది. హ్యాకర్లు చిక్కకూడదంటే క్రోమ్ వినియోగదారులు గుర్తింపు పొందని వెబ్‌సైట్ లింకులు, హైపర్ లింకులు క్లిక్ చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Google has secret webpages that feed your personal data to advertisers, report says

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X