Home
News

Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్

కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కమ్యూనిటీలలో వినాశనం కలిగిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటికే ఫేస్‌బుక్ తన F8 కాన్ఫరెన్స్‌ను వదులుకోవల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యకు బాధితురాలిగా గూగుల్ సంస్థ కూడా మారింది. ఆరోగ్య ముప్పు కారణంగా మే నెలలో జరగవలసిన తన I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

గూగుల్ I/O 2020 ఈవెంట్‌

గూగుల్ I/O 2020 ఈవెంట్‌

గూగుల్ సంస్థ మొదట తన I/O 2020 ఈవెంట్‌ను మే 12 నుండి మే 14 వరకు మౌంటెన్ వ్యూలో నిర్వహించాలని భావించింది. ఇప్పుడు కరోనావైరస్ యొక్క భయం కారణంగా ఈవెంట్ రద్దు చేయబడింది. దీనికి ప్రత్యామ్నాయంగా గూగుల్ ఎటువంటి ప్రణాళికలను అవలించబోతోంది అన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు.

 

 

గూగుల్ ప్రకటనలు

గూగుల్ ప్రకటనలు

" చుట్టూ ఉన్న కరోనావైరస్ (COVID-19) యొక్క ఆందోళనల కారణంగా మరియు CDC, WHO మరియు ఇతర ఆరోగ్య అధికారుల ఆరోగ్య మార్గదర్శకత్వానికి అనుగుణంగా షోర్లైన్ యాంఫిథియేటర్‌లో జరగబోయే గూగుల్ I / O ఈవెంట్‌ను రద్దు చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

డెవలపర్

"రాబోయే వారాల్లో గూగుల్ I / O ను ఉత్తమంగా కనెక్ట్ అవ్వడానికి మరియు డెవలపర్ సంఘాన్ని నిర్మించడం కొనసాగించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తాము. మేము Google I / O వెబ్‌సైట్‌ను అప్ డేట్ చేయడం కొనసాగిస్తాము "అని కంపెనీ తెలిపింది.

 

 

గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ కాన్ఫరెన్స్

గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ కాన్ఫరెన్స్

గూగుల్ యొక్క క్లౌడ్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ మాదిరిగా కాకుండా ఈవెంట్‌ యొక్క తరువాతి తేదీ లేదా ఈవెంట్ యొక్క ఆన్‌లైన్-మాత్రమే వెర్షన్ గురించి ఎలాంటి వార్తలను సంస్థ ఇవ్వలేదు. ఈ సంవత్సరంలో అందరు ఒక I / O ఈవెంట్‌ను చూడకపోవచ్చు అనేదానికి ప్రతీకగా ఇది తలుపు తెరిచింది. అయితే గూగుల్ ప్రస్తుతానికి ఒక ఆప్షన్‌ను తెరిచి ఉంచింది. చిన్న వ్యాపారాల కోసం 1 మిలియన్ మొత్తాన్ని మరియు మౌంటెన్ వ్యూ పాఠశాలల్లో STEM మరియు కంప్యూటర్ సైన్స్ అవకాశాలను పెంచడానికి కంపెనీ ప్రతిజ్ఞ చేసింది.

గూగుల్ I / O ఈవెంట్‌ వివరాలు

గూగుల్ I / O ఈవెంట్‌ వివరాలు

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని సంస్థ తన వార్షిక I / O సమావేశాన్ని రద్దు చేయడం ఇదే మొదటిసారి. ఈ సంస్థ మొదటిసారిగా 10 సంవత్సరాల క్రితం 2008 లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరంలో రద్దు చేయబడిన లేదా వెనక్కి నెట్టివేయబడిన ఈవెంట్‌లు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా వరకు ఉన్నాయి.

 

 

గూగుల్‌తో పాటు ఇతర ప్రభావిత కంపెనీలు

గూగుల్‌తో పాటు ఇతర ప్రభావిత కంపెనీలు

ఏప్రిల్‌లో ఉత్తర కాలిఫోర్నియాలో జరిగే గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్ సదస్సును గూగుల్ రద్దు చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా మెల్బోర్న్లో జరగబోయే తన ‘ఐయోటి ఇన్ యాక్షన్' సమావేశాన్ని రద్దు చేసింది. ఇంకా ఇంటెల్ కూడా తన ఫ్లాగ్ షిప్ కంఫరెన్సు కోసం బ్రీఫింగ్ సెషన్లను రద్దు చేసింది. ఫిబ్రవరి మధ్యలో సిస్కో మెల్బోర్న్లో తన ఫ్లాగ్ షిప్ సిస్కో లైవ్ సమావేశాన్ని రద్దు చేసింది. ఏప్రిల్ నెలలో సిడ్నీలో సేల్స్ ఫోర్స్ సంస్థ నిర్వహించే తన ఫీజికల్ రీజినల్ వరల్డ్ టూర్ ఈవెంట్ ను కూడా రద్దు చేసింది.

 

 

Best Mobiles in India

English summary
Google I/O 2020 Event Canceled Due to Coronavirus Outbreak
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X