Home
News

Google Wallet యాప్ అందుబాటులోకి రానున్నది!! ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో తెలుసా...

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం నిర్వహించిన Google I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో తన యొక్క వినియోగదారుల కోసం వివిధ రకాల సేవలను ప్రకటించింది. ఈ ప్రకటనలలో విడుదలైన వాటిలో ఒకటి గూగుల్ వాలెట్ యాప్. గూగుల్ వాలెట్ యాప్ అనేది కంపెనీ యొక్క స్వంత డిజిటల్ వాలెట్ యాప్. ఇది సాధారణంగా మన వాలెట్‌లలో తీసుకువెళ్లే భౌతిక వస్తువులను డిజిటల్ వెర్షన్‌లలో స్టోర్ చేయబడి ఉపయోగించబడుతుంది. కంపెనీ తన గూగుల్ వాలెట్ యాప్‌తో ఏమి చేయాలని ప్లాన్ చేస్తుందో అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Google Wallet యాప్ గురించి మరిన్ని వివరాలు

Google Wallet యాప్ గురించి మరిన్ని వివరాలు

ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నది. ఈ డిజిటలైజేషన్ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో గూగుల్ వాలెట్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు గూగుల్ ఇప్పటికే ధృవీకరించింది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా జనాభాలో ఎక్కువ మంది ఫుడ్, మెడిసన్ లేదా మరేదైనా ఇతర వస్తువులను ఆర్డర్ చేసినా కూడా ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లను ఉపయోగించుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో డిజిటల్‌ పేమెంట్ లకు డిమాండ్‌ పెరుగుతోంది.

Google Wallet యాప్ ప్రయోజనాలు

Google Wallet యాప్ ప్రయోజనాలు

గూగుల్ సంస్థ కొత్తగా అందుబాటులోకి రాబోతున్న గూగుల్ వాలెట్ యాప్ బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో ఒకటి బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయడం. దీనితో వినియోగదారులు మరింత వేగంగా పేమెంట్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు కార్డ్‌ని ప్రతిచోటా తీసుకెళ్లాల్సిన అవసరం లేనందున ఇంట్లో సురక్షితంగా ఉంచుకోవడానికి కూడా వీలును కల్పిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో డిజిటల్ ఐడిల కోసం యాప్‌కు మద్దతు లభిస్తుందని గూగుల్ ధృవీకరించింది. ఇది NFC ద్వారా చేయబడుతుంది కాబట్టి వినియోగదారులు తమను తాము గుర్తించుకోవడం చాలా సులభం.

బోర్డింగ్ పాస్‌

దీనితో పాటుగా వినియోగదారులు తమ ఫ్లైట్ కోసం తమ బోర్డింగ్ పాస్‌ను ఈ యాప్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు. దీని కారణంగా ఫ్లైట్ ఏదైనా ఆలస్యం లేదా రద్దు గురించి వినియోగదారులకు తెలియజేస్తుందని గూగుల్ తెలియజేసింది. గూగుల్ వాలెట్ యాప్ ఇతర గూగుల్ సర్వీస్‌లకు కూడా అనుకూలంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రైవేట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది అని కూడా కంపెనీ హామీ ఇస్తుంది. అంతే కాకుండా వినియోగదారులు డిజిటల్ ఆఫీస్ మరియు హోటల్ కీలను కూడా స్టోర్ చేయగలరు. గూగుల్ తన పేమెంట్ యాప్ ఇప్పటికీ తన సేవలను అందించడాన్ని కొనసాగిస్తుందని ధృవీకరించింది. కంపెనీ యొక్క గూగుల్ పే ప్రస్తుతం వినియోగదారులను ఏవైనా లావాదేవీలు చేయడానికి, బిల్లులు లేదా ఏదైనా ఇతర ఖర్చులను చేయడానికి అనుమతిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google I/O 2022: Google Confirmed Launching New Google Wallet App in 40 Countries
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X